సరిహద్దులు దాటని ప్రేమకథ

సాహసం శాయరా డింభకా అని ఏ నేపాళ మాంత్రికుడు చెప్పకపోయినా తను ప్రేమించే నెచ్చెలి కోసం పెద్ద సాహసమే చేశాడు సిద్ధిఖి మహ్మద్‌ జిషాన్‌.. మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఉండే ఈ ప్రేమికుడికి పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో..

సరిహద్దులు దాటని ప్రేమకథ

Edited By:

Updated on: Oct 18, 2020 | 10:19 PM

సాహసం శాయరా డింభకా అని ఏ నేపాళ మాంత్రికుడు చెప్పకపోయినా తను ప్రేమించే నెచ్చెలి కోసం పెద్ద సాహసమే చేశాడు సిద్ధిఖి మహ్మద్‌ జిషాన్‌.. మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఉండే ఈ ప్రేమికుడికి పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో ఉండే సమ్రాతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌షిప్‌ మొదలయ్యింది.. అది కాస్తా ప్రేమగా చిగురించింది.. కొన్నాళ్లకు మహావృక్షంగా మారింది.

ఇక ఆమెను కలుసుకోకుండా ఉండలేకపోయాడు జిషాన్‌.. గదర్‌ సినిమా ఇచ్చిన ప్రేరణో మరోటో తెలియదుగానీ అక్రమంగా సరిహద్దులు దాటేద్దామనుకున్నాడు.. గుజరాత్‌ కచ్‌ దగ్గర తచ్చాడుతున్న ఇతగాడిని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అడ్డుకున్నారు.. టన్నుల కొద్దీ ప్రేమున్నా ఇలా తమ కన్నుగప్పి సరిహద్దులు దాటడం తగని పని అని నాలుగు అంక్షితలు వేసి ఆపై అరెస్ట్‌ చేశారు. దాంతో జిషాన్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది.. ప్రస్తుతం ప్రేమే నేరమౌనా మాపై ఈ పగేలా అంటూ పాటలు పాడుకుంటున్నాడు..

Loading...
Unable to load recommendations.
Follow Us