
దేశ ఆర్థక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యా్ర్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సుపై రోడ్డు పక్కనున్న ఓ భారీ వృక్ష కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది విద్యార్థులకు హాస్పిటల్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చెంబూర్‌లోని యూనివర్సల్ హై స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ వ్యాన్‌పై రోడ్డుపక్కన ఉన్న భారీ రావి చెట్టు ఒక్కసారిగా వేరుతో సహా కూలిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ఓ విద్యార్థి లోపలే చిక్కుకుపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది, బీఎంసీ వార్డు సిబ్బంది చెంబూర్‌లోని రోడ్ నంబర్-11 వద్ద సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో చిక్కుకున్న విద్యార్థిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.