అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కొడుకును ఇనుప సంకెళ్లతో కట్టేసిన తండ్రి

అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకుపై కఠినంగా వ్యవహరించాడు ఓ తండ్రి. రెండు రోజులు ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి కడుపు మాడ్చాడు. దీంతో అతడు నీరసించి పోవడంతో.. ఇరుగు పొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో..

అన్నం ఎక్కువగా తినేస్తున్నాడని కొడుకును ఇనుప సంకెళ్లతో కట్టేసిన తండ్రి
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2020 | 5:12 PM

అన్నం ఎక్కువగా తింటున్నాడని కన్న కొడుకుపై కఠినంగా వ్యవహరించాడు ఓ తండ్రి. రెండు రోజులు ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి కడుపు మాడ్చాడు. దీంతో అతడు నీరసించి పోవడంతో.. ఇరుగు పొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.

అసలు వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సైనీ ప్రాంతంలో కందైలాల్ అనే నిరుపేద కుటుంబం నివసిస్తోంది. వీరు రోజూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూంటారు. పని చేస్తేనే పూట గడుస్తుంది. ఇంట్లో వారంతా పని చేస్తున్నా.. అతని కొడుకు విజయ్ మాత్రం బలాదూర్‌‌గా తిరిగే వాడు. తండ్రి పని చేయాలని చెప్పినా కూడా వినిపించుకునే వాడు కాదు. ఈ క్రమంలోనే అతడు ఇంటికి వచ్చి ఎవరికీ అన్నం మిగల్చకుండా తినేశాడు. మిగిలిన ఇంటి సభ్యులు తినడానికి ఇంట్లో బియ్యం కూడా లేకపోవడంతో తండ్రి కోపంతో ఊగిపోయాడు. వెంటనే గొలుసులతో అతన్ని కట్టిపడేశాడు.

ఇక ఈ విషయంపై ఇంటి యజమానిని పోలీసులు ప్రశ్నించారు. ఇంట్లో ఆర్థిక కష్టాలకు తోడు పనిచేయకుండా ఎక్కువ అన్నం తింటున్నాడని ఆ తండ్రి వెల్లడించాడు. అన్నం తిన్నా తనకు బాధ లేదని.. కానీ పని చేసి వచ్చిన వారంతా ఆరోజు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సి వచ్చింది అందుకే కట్టేయాల్సి వచ్చిందని వెల్లడించడంతో వారి పరిస్థితి చూసి పోలీసులు కూడా కరిగిపోయారు.

Read More: 

నాసా బంపర్ ఆఫర్.. మూన్‌పై టాయిలెట్‌ కట్టేందుకు బెస్ట్ ఐడియా ఇస్తే..

‘గూగుల్ పే’లో కొత్త ఫీచర్.. అప్పులు ఇచ్చేందుకు సిద్ధం..

వీడియో వైరల్: బుల్లెట్ నడుపుతూ బోర్లాపడ్డ జెర్సీ హీరోయిన్..

బ్రేకింగ్: మరో సీరియల్ నటుడికి కరోనా.. షూటింగ్ రద్దు

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట