World Book of Records: పుట్టిన 72 రోజులకే వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు! అసలింతకీ ఏం చేసిందంటే..

|

Oct 12, 2023 | 6:03 PM

ఈ చిన్నారి పుట్టి కేవలం 72 రోజులే అయ్యింది. ఇంత చిన్న వయసున్న చిన్నారి పేరు మీద ఏకంగా 33 ప్రభుత్వ ధ్రవపత్రాలు రావడంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేంటీ.. అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడా జిల్లాకు చెందిన కేసరినందన్ సూర్యవంశీ, ప్రియాంక దంపతులకు ఈ ఏడాది జూలై 8వ తేదీన చిన్నారి శరణ్య జన్మించింది. పుట్టి మూడు నెలలయ్యేలోపు చిన్నారి శరణ్య ఏకంగా ప్రపంచ..

World Book of Records: పుట్టిన 72 రోజులకే వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు! అసలింతకీ ఏం చేసిందంటే..
72 Day Old Child Sets World Book Of Record
Follow us on

ఛింద్‌వాడా, అక్టోబర్‌ 12: ఈ చిన్నారి పుట్టి కేవలం 72 రోజులే అయ్యింది. ఇంత చిన్న వయసున్న చిన్నారి పేరు మీద ఏకంగా 33 ప్రభుత్వ ధ్రవపత్రాలు రావడంతో ప్రపంచ రికార్డు సృష్టించింది. అదేంటీ.. అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా? అయితే మీరీ విషయం తెలుసుకోవాల్సిందే.. మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడా జిల్లాకు చెందిన కేసరినందన్ సూర్యవంశీ, ప్రియాంక దంపతులకు ఈ ఏడాది జూలై 8వ తేదీన చిన్నారి శరణ్య జన్మించింది. పుట్టి మూడు నెలలయ్యేలోపు చిన్నారి శరణ్య ఏకంగా ప్రపంచ రికార్డు సాధించేసింది. అదేలాగంటే తమ పాప పుట్టుక ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్న ఈ దంపతులు గతంలో 28 గుర్తింపు పత్రాలతో ఓ చిన్నారి పేరిట ప్రపంచ రికార్డు ఉందనే విషయం తెలుసుకున్నారు. దీంతో తామూ తమ కూతురు పేరును ప్రపంచ రికార్డుల్లో చేర్చాలనుకున్నారు. వెంటనే దంపతులిద్దరూ పోటీకి దిగారు. అందుకు వీలైనన్ని ఎక్కువ డాక్యుమెంట్లు తమ కూమార్తె పేరు మీద తీసుకురావాలనుకున్నారు. అలా తమ కుమార్తె శరణ్య పుట్టిన 72 రోజుల్లోనే 31 రకాల ధ్రువపత్రాలు సాధించి వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించగలిగారు.

శరణ్య తల్లిదండ్రులు కేసరి నందన్‌, ప్రియాంక ఇద్దరూ చందన్‌గావ్‌లోని తపాలాశాఖలో ఉద్యోగులు. అంతేకాకుండా శరణ్య తాతయ్య కూడా పోస్టల్‌ ఉద్యోగే. శరణ్య పేరుతో 72 రోజుల్లో 31 గుర్తింపు పత్రాలు సంపాదించి లక్ష్యాన్ని సాధించారు. పాస్‌పోర్ట్‌, ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, ఇమ్యునైజేషన్ కార్డ్, ‘లాడ్లీ లక్ష్మి’ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, జాతీయ ఆరోగ్య కార్డ్, ‘సుకన్య సమృద్ధి’ ఖాతా, ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ పత్ర’, ‘రాష్ట్రీయ పొదుపు పత్రాలు’, ‘కిసాన్ వికాస్ పత్ర’, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా, పీఎన్‌బీ ఎటీఎమ్‌ కార్డ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా, బ్యాంకు ఖాతాలు.. ఇలా పలురకాల పత్రాలు ఇందులో ఉన్నాయి.

కాగా సరైన గుర్తింపు పత్రాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అనేక ప్రభుత్వ పథకాలకు వారు దూరం అవుతుంటారు. అటువంటి వారిలో అవగాహన కల్పించేందుకే ఇలా చేశామని తెలిపారు. అంతేకాకుండా కూతురు పుట్టినప్పుడు ఏయే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయో, వాటిని ఎలా పొందాలో వంటి వివరాలు ఎలా పొందాలో తెలియజేయాలనుకున్నాం. సంబంధిత వివరాలతో సకాలంలో దరఖాస్తు చేస్తే ఎలాంటి ధృవీకరణ పత్రం అయినా సులువుగా అందుకోవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.