50th Vijay Diwas: ఘనంగా విజయ్‌ దివస్‌.. అమరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..

|

Dec 16, 2021 | 1:14 PM

యావత్ భారతదేశం విజయ్‌ దివస్‌ను ఘనంగా జరుపుకుంటోంది. 50వ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలొని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ నివాళులు అర్పించారు...

50th Vijay Diwas: ఘనంగా విజయ్‌ దివస్‌.. అమరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..
Modi1
Follow us on

యావత్ భారతదేశం విజయ్‌ దివస్‌ను ఘనంగా జరుపుకుంటోంది. 50వ విజయ్ దివస్ సందర్భంగా ఢిల్లీలొని అమరుల స్థూపం వద్ద ప్రధాన మంత్రి మోడీ నివాళులు అర్పించారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం అంటే 1971లో పాకిస్తాన్‎ను ఓడించి బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. ఏటా డిసెంబర్ 16న విజయ దివస్‎గా జరుపుకుంటాం.

విజయ దివస్ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ వద్ద అప్పటి యుద్ధంలో అమరులైన భారత సైనికులకు తూర్పు నావికాదళం నివాళులర్పింది. ఈ కార్యక్రమంలో నావల్ ప్రొజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ పాల్గొన్నారు. వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

“50వ విజయ దివస్ సందర్భంగా బంగ్లాకు చెందిన సాయుధ బలగాలు, భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యపరాక్రమాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. మనం కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తుల్ని ఓడించాం.” అని ప్రధాని మోడీ చెప్పారు. 50వ విజయ్ దివస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. బంగ్లా అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌.. కోవింద్‌ను ‘గౌరవ అతిథి’ గా ఆహ్వానించారు.

Read Also.. Bullock Cart Race: మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందాల నిర్వహణకు సుప్రీం సై.. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే నిబంధనలు ఉండాలంటూ వ్యాఖ్యలు..