ఆ ‘ఎగ్ చికెన్ రోల్’ చూస్తే ఎవరికైనా నోరూరాల్సిందే.. డౌట్ లేదు.. రెండు అడుగుల పొడవైన ఈ రోల్ ముఖ్యంగా చికెన్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఢిల్లీలో ఓ సాధారణ స్టాల్ లో తయారవుతోంది. పది కోడిగుడ్లను వేసి.. మసాలా, ఇతర దినుసులను వేసి స్పైసీగా దట్టించి చేస్తున్నారు దీన్ని.. ఈ చికెన్ రోల్ ఖరీదు కాస్త ఎక్కువైనా ఇష్టమైన డిష్ తినాలనిపించినప్పుడు అదేమీ అంత కాస్ట్ అనిపించదు..పైగా వేస్ట్ అని కూడా అనిపించదు.. భారీ త్రి స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో కాక.. ఆర్డినరీ స్టాల్ లో కుక్స్ దీన్ని తయారు చేస్తున్నారంటే నమ్మలేం. కానీ నమ్మాల్సిందే.. ఫుడ్ బ్లాగర్ తనీష్ శర్మ ఈ బడా చికెన్ రోల్ తయారీ తాలూకు వీడియోను తన ఇన్స్ టాగ్రామ్ లో షేర్ చేశాడు. పాట్నా రోల్ సెంటర్ అనే ఈ స్టాల్ లో ఈ ఎగ్ చికెన్ రోల్ వేడివేడిగా తరవుతోంది. ఎవరైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ స్టాల్ ని విజిట్ చేసి దీని రుచి చూడాలని కోరుతున్నాడీయన
ముఖ్యంగా హాలిడేస్ రోజుల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుందట.. పండుగలు, పబ్బాల రోజుల్లో అయితే మరీనూ అంటున్నాడు. ఈ ఫుడ్ బ్లాగర్ తానింకా ఇలాంటి వెరైటీ డిష్ తయారీలను ఇంకా చూపుతానంటున్నాడు. తన వీడియోలు అందరికీ నచ్చుతాయంటున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా
LIC Plan: ఈ LIC పాలసీ ఆధార్ కార్డు ఉన్న మహిళలను ధనవంతురాలిని చేస్తుంది.. ఎలాగో తెలుసుకోండి