Purvanchal Expressway: భారీ వర్షానికి కుంగిన ఎక్స్‌ప్రెస్‌ వే.. 15 లోతులో కూరుకుపోయిన వాహనాలు..

|

Oct 08, 2022 | 10:41 AM

గత ఏడాది నవంబర్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలతో పోలిస్తే ఈ ఎక్స్‌ప్రెస్‌వే పటిష్టంగా ఉండటమే కాకుండా దాని నాణ్యత కూడా చాలా బాగుందని

Purvanchal Expressway: భారీ వర్షానికి కుంగిన ఎక్స్‌ప్రెస్‌ వే.. 15 లోతులో కూరుకుపోయిన వాహనాలు..
Purvanchal Expressway
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే గత రాత్రి పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే గురువారం రాత్రి కుంగిపోయింది. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా వెళ్తున్న ఓ కారు ఆ గుంతలో పడింది. కాగా వెనుక వస్తున్న దాదాపు అరడజను వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లేదంటే, పెను ప్రమాదం జరిగి ఉండేది. అయితే ఈ ఘటన సమాచారం అందిన వెంటనే ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డును రాత్రికి రాత్రే మరమ్మతులు చేసి చిన్న వాహనాల రాకపోకలను ప్రారంభించగా, భారీ వాహనాలను దారి మళ్లించారు.

గత ఏడాది నవంబర్‌లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇతర ఎక్స్‌ప్రెస్‌వేలతో పోలిస్తే ఈ ఎక్స్‌ప్రెస్‌వే పటిష్టంగా ఉండటమే కాకుండా దాని నాణ్యత కూడా చాలా బాగుందని పేర్కొన్నారు. అయితే రెండు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షం ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిజస్వరూపాన్ని చాటి చెప్పింది. గత రాత్రి, హలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైల్ స్టోన్ 83 సమీపంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డు కుప్పకూలింది. ఈ సమయంలో ఈ రహదారిపై సుమారు 15 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతులో గొయ్యి ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ కారు ఈ గుంతలో కూరుకుపోయింది. అంతే కాదు వెనుక వచ్చే వాహనాలు కూడా ఢీకొని దెబ్బతిన్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, యూపీడీఏ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. హడావుడిగా పోలీసులు, యూపీడీఏ ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకుని గుంతలో పడిన వాహనాలను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ వాహనంలో ఉన్న వారందరూ సురక్షితంగా ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావటంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మండిపడింది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వే ఒక్క వర్షానికే 15 అడుగుల గొయ్యి ఏర్పడిందని ట్విటర్‌ వేదికగా విమర్శించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..