హాస్పిటల్‌ టాయిలెట్‌లో 14 ఏళ్ల బాలిక ప్రసవం.. బిడ్డను కమోడ్‌లో వేసి ఫ్లష్! ఆ తర్వాత..

పురిటి నొప్పులతో 14 ఏళ్ల బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడి టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. భయంతో కమోడ్‌లో పడేసి ప్లష్‌ చేసేందుకు ప్రయత్నించింది. అనంతరం టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చి కళ్లు తిరిగి పడిపోయింది. రక్తం మరకలు చూసిన కొందరు వ్యక్తులు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు..

హాస్పిటల్‌ టాయిలెట్‌లో 14 ఏళ్ల బాలిక ప్రసవం.. బిడ్డను కమోడ్‌లో వేసి ఫ్లష్! ఆ తర్వాత..
Miner Girl Delivered In Hospital Toilet

Updated on: May 24, 2026 | 10:48 AM

రాంచీ, మే 24: ప్రసవ వేదనతో 14 ఏళ్ల బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అక్కడి టాయిలెట్‌లో బిడ్డను ప్రసవించి.. భయంతో కమోడ్‌లో పడేసి ప్లష్‌ చేసేందుకు ప్రయత్నించింది. అనంతరం టాయిలెట్‌ నుంచి బయటకు వచ్చి కళ్లు తిరిగి పడిపోయింది. రక్తం మరకలు చూసిన కొందరు వ్యక్తులు ఆస్పత్రి వైద్యులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని గిరిడిహ్‌లో శుక్రవారం (మే 22) చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

జార్ఖండ్‌లోని గిరిడిహ్‌లో శుక్రవారం గర్భవతి అయిన 14 ఏళ్ల బాలిక సదర్ ఆసుపత్రికి చేరుకుంది. ఒక వార్డులోని టాయిలెట్‌లోకి వెళ్లిన బాలిక అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భయతో పసికందును టాయిలెట్‌ కమోడ్‌లో వేసి ఫ్లష్‌ చేసేందుకు ప్రయత్నించింది. కుదరకపోవడంతో టాయిలెట్ బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇంతలో కళ్లు తిరిగి ఆస్పత్రి ఆవరణలోనే పడిపోయింది. టాయిలెట్‌ లోపల, బయట రక్తం మరకలు ఉండటంతో గమనించిన కొందరు వ్యక్తులు ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేశారు.

దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రి సిబ్బందితోపాటు టాయిలెట్‌ను తనిఖీ చేయగా నవజాత శిశువు కమోడ్‌లో ఇరుక్కుని ఉండటం గమనించారు. వెంటనే టాయిలెట్‌ కమోడ్‌లో ఇరుక్కున్న నవజాత శిశువును రక్షించి.. బాలిక, పసికందును అంబులెన్స్‌లో చైతాడిహ్‌లోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్ బైతా తెలిపారు. ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చి వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

14 ఏళ్ల బాలిక గర్భం దాల్చడం, శిశువుకు జన్మనివ్వడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి రతన్ కుమార్ సింగ్ తెలిపారు. బాలిక వయస్సు, ఘటన జరిగిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేసులోని అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తామని పోలీసులు అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us