ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్…

ఎంఎస్ ధోని..ఆటగాడిగానే కాదు సారథిగా కూడా భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన వ్యక్తి. అయితే అనూహ్యంగా బీసీసీఐ ధోనిని ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటనే ఇంక మిగిలుందని అందరూ భావించారు. ఈ సమయంలో ధోనిని ఫ్యాన్స్‌కు సాలిడ్ న్యూస్ చెప్పారు చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్. వచ్చే రెండు సీజన్లు ధోని ఐపీఎల్‌లో చెన్నై తరుఫున ఆడతారని  స్పష్టం చేశారు. అతనిపై తమకు అపారమైన అనుభవం ఉందని,  […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:27 pm, Sun, 19 January 20
ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్...

ఎంఎస్ ధోని..ఆటగాడిగానే కాదు సారథిగా కూడా భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన వ్యక్తి. అయితే అనూహ్యంగా బీసీసీఐ ధోనిని ప్లేయర్స్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటనే ఇంక మిగిలుందని అందరూ భావించారు. ఈ సమయంలో ధోనిని ఫ్యాన్స్‌కు సాలిడ్ న్యూస్ చెప్పారు చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్. వచ్చే రెండు సీజన్లు ధోని ఐపీఎల్‌లో చెన్నై తరుఫున ఆడతారని  స్పష్టం చేశారు. అతనిపై తమకు అపారమైన అనుభవం ఉందని,  చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా అతడే ఉంటాడని వెల్లడించారు.

కాగా ధోనిని బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించిన రోజే..ఝార్ఖండ్‌ రంజీ జట్టుతో కలిసి నెట్స్‌లో సాధన చేశాడు. ధోని టీమిండియాలోకి పునరాగమనం చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత ఏడాది జూలైలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమి నుంచి భారత మాజీ భారత కెప్టెన్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమయ్యాడు.  భారత క్రికెట్‌ లెజెండ్స్‌లో ఒకరైన ధోని దక్షిణాఫ్రికాలో 2007 ప్రపంచ టి20, స్వదేశంలో 2011 వన్డే ప్రపంచ కప్ లాంటి  రెండు వరల్డ్ టైటిల్స్‌ను సారథిగా దేశానికి అందించాడు. ఇండియా తరుఫున ధోని ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు.. 98 టి20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.