Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • నెల్లూరు : కరోనా కారణంగా మూతపడ్డ పోలీస్ స్టేషన్. వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం. 11 మంది పోలీస్ సిబ్బంది కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. వెంకటగిరి సిఐ తో పాటు ఎస్సై కి కరోన పాజిటివ్..మరో ఏడు మంది కానిస్టేబుల్ కి హోంగార్డులను పాజిటివ్. పాజిటివ్ కేసుల్లో పీఎస్ లో మహిళ స్వీపర్లు. మర్డర్ కేసులో నిందితుల ద్వారా కరోనో సోకినట్లు సమాచారం.
  • నిమ్స్ లో కరోనా కలకలం . టెస్టింగ్ ల్యాబ్ సిబ్బంది ముగ్గురికి కరోనా పాజిటివ్ . మిల్లినియం బ్లాక్ నుండి ఐటిఎమర్ భవనానికి ల్యాబ్ ని టెస్టుల ప్రక్రియ కోసం మార్చడం తో బాధితులు గా మారుతున్న ల్యాబ్ సిబ్బంది .
  • కర్నూలు: నంద్యాలకు చెందిన బ్యాంక్ ఉద్యోగి కరోనాతో మృతి. మృతి చెందిన వ్యక్తి శిరివెళ్ళ మండలం యర్రగుంట్ల స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం . మృతి చెందిన వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకో గా కరోనా నిర్దారణ. పరిస్థితి విషమంగా ఉండగా కర్నూలు తరలిస్తూండగా కోలుకోలేక మృతి.
  • వరంగల్: నేడు సంపూర్ణ శాకాంబరీగా దర్శనమిస్తున్న భద్రకాళి అమ్మవారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య ఉత్సవాలు. భక్తులు ఎవరూ అమ్మవారికి కూరగాయలు తీసుకురావద్దని విజ్ఞప్తి. నిరాడంబరంగా ఉత్సవాలు.. నేరుగా తోట నుండి కూరగాయలు సేకరించి అమ్మవారిని సంపూర్ణ శాకాంబరీగా అలంకరించిన ఆలయ పూజారులు. సాయంత్రం 8గంటల వరకే దర్శనాలు.
  • చెన్నై : హాస్పిటల్ మూసివేత. చెన్నైలోని విజయా హాస్పిటల్లో కరోనా కలకలం. 50 మందికి పైగా హాస్పిటల్ సిబ్బందికి కరోనా పాజిటివ్. కరోనా తో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ రెడ్డి మృతి. హాస్పిటల్ ఈమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేత. హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషేంట్ లను ఇతర హాస్పిటల్స్ కు తరలింపు. హాస్పిటల్ లో సిబ్బందికి, వచ్చిన రోగులకు కరోనా టెస్టులు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి తరచూ వైద్యం కోసం విజయ హాస్పిటల్ కు వెళుతున్న వారిలో ఆందోళన.
  • తూ.గోజిల్లా: పిఠాపురం జగ్గయ్య చెరువులో వెలుగుచూసిన మరో ఘరానా మోసం. బ్యాంకు ఆఫ్ బరోడా పి.ఆర్.ఓ నని నమ్మబలికి రూ.1000 తో అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంకు నుండి రూ.50000 రుణం ఇప్పిస్తానని నమ్మించిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి . జగ్గయ్య చెరువు ప్రాంతంలో 100 మంది వద్ద రూ.1000చొప్పున వసూలు చేసి, ఒక అప్లికేషన్ ఫారం కూడా పూర్తిచేసి నమ్మించిన ఉడాయించిన వ్యక్తి.

బీజేపీలో చేరగానే మోత్కుపల్లి ఎంతమాట అనేశారు!

motkupally joined bjp, బీజేపీలో చేరగానే మోత్కుపల్లి ఎంతమాట అనేశారు!

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన మోత్కుపల్లి పలు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి పార్టీని వీడారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగిన సమయంలోను ఆయన టీడీపీ పక్షానే నిలబడ్డారు. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి సేవ చేస్తూ అలాగే కొనసాగారు. అయితే, ఒక దశలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో టీడీపీ స్నేహం నెరిపినన్ని రోజులు మోత్కుపల్లి గవర్నర్ గిరిపై ఆశతోనే గడిపారు. ఆ తర్వాత 2018 తొలి నాళ్ళలో ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో విభేదించిన చంద్రబాబు.. ఎన్డీయేకు దూరమయ్యారు. దాంతో మోత్కుపల్లికి గవర్నర్ గిరి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

అదే అసంతృప్తితో కొంతకాలంపాటు టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి మరీ పార్టీకి దూరమయ్యారు. ఆ వెంటనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ నుంచి ఆహ్వానం లేకపోవడమో లేక మరేదైనా కారణమో కానీ ఆయన ఒంటరిగానే వుండిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి దారుణంగా ఓటమి పాలయ్యారు.

దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా మోత్కుపల్లికి పేరుంది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల తరుణంలో కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. గత వారం రెండు దఫాలుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో సమావేశమైన మోత్కుపల్లి మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షితున్నై ఆ పార్టీలో చేరానని ఆయన చెప్పారు. కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అమిత్ షాకు వివారించామని, పార్టీలో ఒక సైనికునిలా పనిచేస్తానని ఆయనంటున్నారు.

Related Tags