Silver Price Today: కొత్త సంవత్సరంలో వెండి ధరలు షాకిస్తున్నాయి. మహిళలు బంగారం, వెండికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. బంగారంతో పాటు వెండి కొనుగోళ్లు కూడా భారీగానే జరుగుతుంటాయి. బంగారం ధరలు పరుగులు పెడుతుంటే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. తాజాగా శనివారం (జనవరి1)న వెండి ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలలోపు నమోదైనవి మాత్రమే. మళ్లీ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా ధరలు కొన్ని నగరాల్లో స్థిరంగా ఉంటే.. కొన్ని నగరాల్లో స్వల్పంగా దిగి వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర.62,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.62,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, కోల్‌కతాలో రూ.62,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,200 ఉండగా, కేరళలో రూ.65,400 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,400 ఉండగా, విజయవాడలో రూ.65,400 వద్ద కొనసాగుతోంది.
అయితే ప్రతి రోజు బంగారం, వెండి ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ఇలా బంగారం, వెండి ధరలలో మార్పులు కావడానికి ఎన్నో కారణాలున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి: