డాక్టర్ అంకుల్ రూ.10 తీసుకుని.. ‘ఈ కోడిపిల్లను బతికించండి ప్లీజ్’

పసిపిల్లల మనసులు స్వచ్ఛమైనవి. వారు చెప్పే ముద్దు ముద్దు మాటలు..చేసే అల్లరి పనులు ఎంతో ముచ్చటగా ఉంటాయి. వారికి అమాయకత్వం పెట్టని ఆభరణం.. ఇలాంటి మాటలు మనం రచనలు, కవితల్లో చదువుతూ ఉంటాం. అయితే మిజోరంలో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే పై వ్యాఖ్యలు అక్షరాలా నిజమేననిపిస్తుంది. నిజంగా పిల్లలు చేసే పనులు ఒక్కోసారి ముచ్చట గొలుపుతుంటాయి. మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. […]

డాక్టర్ అంకుల్ రూ.10 తీసుకుని.. 'ఈ కోడిపిల్లను బతికించండి ప్లీజ్'
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 10:06 PM

పసిపిల్లల మనసులు స్వచ్ఛమైనవి. వారు చెప్పే ముద్దు ముద్దు మాటలు..చేసే అల్లరి పనులు ఎంతో ముచ్చటగా ఉంటాయి. వారికి అమాయకత్వం పెట్టని ఆభరణం.. ఇలాంటి మాటలు మనం రచనలు, కవితల్లో చదువుతూ ఉంటాం. అయితే మిజోరంలో చోటుచేసుకున్న ఈ ఘటన చూస్తే పై వ్యాఖ్యలు అక్షరాలా నిజమేననిపిస్తుంది. నిజంగా పిల్లలు చేసే పనులు ఒక్కోసారి ముచ్చట గొలుపుతుంటాయి. మిజోరం రాష్ట్రానికి చెందిన ఓ ఆరేళ్ల బాలుడు చేసిన పనికి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ పిల్లాడి అమాయకత్వంలో ఉన్న మానవత్వానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ధీరజ్‌ ఛెత్రి అనే వ్యక్తి పోలీసు విధుల్లో భాగంగా మిజోరంలోని సైరంగ్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆయనకు డెరెక్‌ సీ లాల్‌ఛన్‌హిమా అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఇంటి సమీపంలోని రోడ్డుపై ఆడుకుంటుండంగా.. అనుకోకుండా పక్కింటివాళ్ల కోడిపిల్లపై నుంచి తన సైకిల్‌ వెళ్లింది. దీంతో అది అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలియని డెరెక్‌ కోడిపిల్లని తీసుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. అది చనిపోయిందన్న విషయం తెలియని ఆ బాలుడు అతని తల్లిదండ్రులను కోరాడు. ‘ప్లీజ్ మమ్మీ..ప్లీజ్ డాడీ..ఈ చిక్‌ని రక్షించండి.” అని ఏడుస్తూ అడిగాడు. ఐతే అది బతకదని తెలిసిన తల్లిదండ్రులు.. ”నువ్వే ఆస్పత్రికి తీసుకెళ్లు”. అని సరదాగా చెప్పారు.

ఐతే ఆ బాలుడు నిజంగానే కోడిపిల్లను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఓ చేతిలో పది రూపాయల నోటును, మరో చేతిలో కోడిపిల్లను పట్టుకొని డాక్టర్‌ దగ్గరకు వెళ్లాడు. ”అంకుల్…ఈ పది రూపాయలు తీసుకొని కోడిపిల్లను రక్షించండి .” అక్కడే ఉన్న ఓ నర్సు డెరెక్ అమాయకత్వాన్ని, మానవత్వాన్ని చూసి ముచ్చటపడింది. ఆ పిల్లాడిని, కోడిపిల్లను ఫొటోతీసి ఇంటికి పంపించారు. ఐతే ఏడుస్తూ ఇంటికి చేరిన డెరెక్..డాక్టర్లపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. వైద్యులు ఎలాంటి చికిత్స చేయలేదని చెప్పారు. ఎక్కువ డబ్బులు ఇస్తే చికిత్స చేస్తారేమో.. వంద రూపాయలు ఇవ్వండని అడిగాడు. ఐతే తల్లిదండ్రులు చివరకు నిజం చెప్పారు. కోడిపిల్ల చనిపోయిందని.. మళ్లీ బతకదని వివరించడంతో కన్నీళ్లుపెట్టుకున్నాడు డెరెక్.

ఆ నర్సు తీసిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనికి ఇప్పటివరకు దాదాపు లక్షకు పైగా లైక్‌లు రాగా.. చిన్నారి నిండు మనసును ప్రశంసిస్తూ 10వేల మందికిగా పైగా కామెంట్లు చేశారు. తన వల్ల ఒక ప్రాణికి హాని జరిగిందని తల్లడిల్లిన ఈ చిన్నారి అందరికీ స్ఫూర్తి. అతడిలోని నిజాయితీ, వినయము, జవాబుదారీతనం,మానవత్వానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు