ఇండియాతో కలిసి పని చేస్తాం: అమెరికా విదేశాంగ మంత్రి

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25నుంచి పాంపియో రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. కాగా భారత పర్యటనలో భాగంగా […]

ఇండియాతో కలిసి పని చేస్తాం: అమెరికా విదేశాంగ మంత్రి
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:29 AM

ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఈ నెల 25నుంచి పాంపియో రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక భద్రత, ఆర్థిక భాగస్వామ్యాల గురించి ఇరువురు నేతలు చర్చించారు.

కాగా భారత పర్యటనలో భాగంగా పాంపియో పలువురు మంత్రులతో ఆయన సమావేశమవుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. ‘‘భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, పరస్పరం లాభదాయకమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలకు ఆయన పర్యటనను చక్కని అవకాశంగా భావిస్తున్నాం’’ అని కుమార్ అన్నారు