భారత్-నేపాల్ మధ్య ‘కంట్లో నలుసు’గా మారిన ‘కాలాపాని’..

నిన్న మొన్నటివరకు ఇండియాకు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ ఇపుడు శత్రు దేశంగా మారిపోయింది. నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ‘ జంక్షన్ ‘ లో ఉన్న ‘ కాలాపాని ‘ ప్రాంతం తమదని, ఇక్కడి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఆ దేశ ప్రధాని కె. పి. ఓలి డిమాండ్ చేశారు. ఇటీవల ఇండియా రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్ లో ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేశంలో ఉన్నట్టే […]

భారత్-నేపాల్ మధ్య 'కంట్లో నలుసు'గా మారిన 'కాలాపాని'..
Follow us

|

Updated on: Nov 19, 2019 | 11:42 AM

నిన్న మొన్నటివరకు ఇండియాకు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ ఇపుడు శత్రు దేశంగా మారిపోయింది. నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ‘ జంక్షన్ ‘ లో ఉన్న ‘ కాలాపాని ‘ ప్రాంతం తమదని, ఇక్కడి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఆ దేశ ప్రధాని కె. పి. ఓలి డిమాండ్ చేశారు. ఇటీవల ఇండియా రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్ లో ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేశంలో ఉన్నట్టే చూపారు. (కాలాపాని నేపాల్ పశ్చిమ భాగంలో ఉంది). ఈ వివాదంపై ఓలి బహిరంగ విమర్శ చేయడం ఇదే మొదటిసారి. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించనప్పటికీ.. ఈ మ్యాప్ ప్రకారం.. ఈ ప్రాంతం ఖఛ్చితంగా ‘ భారత సార్వభౌమాధికార సరిహద్దే ‘ నని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ తో కొత్తగా సరిహద్దు వివాదం లేదని తెలిపాయి. అయితే నేపాల్ పాలక కమ్యూనిస్ట్ పార్టీ యువజన విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఓలి.. తమ దేశ సరిహద్దుల్లోని ఒక్క అంగుళాన్నయినా ఏ దేశమూ ఆక్రమించుకోజాలదని అన్నారు. ఇండియా తక్షణమే కాలాపాని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన మ్యాప్ తో నేపాల్ కొత్త దాన్ని రూపొందించాలన్న సూచనను ఆయన కొట్టిపారేశారు. ‘ మా భూమి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఆ తరువాతే ఆ దేశంతో చర్చలు జరుపుతాం ‘ అని పేర్కొన్నారు. భారతీయ మ్యాప్ లపై నేపాల్ లో పాలక, ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితమే ప్రధాని ఓలి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొన్న మాజీ ప్రధానులు, మాజీ విదేశాంగ మంత్రులతోసహా అనేకమంది ఈ అంశంపై వెంటనే ఇండియాతో చర్చించాలని డిమాండ్ చేశారు.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..