అంజన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి దీక్షాపరులపైకి లారీ దూసుకెళ్లింది. వీరంతా కొండగట్టు అంజన్న దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. రాజేందర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. వీరిద్దరూ చొప్పదండి మండలం బూపాలపట్నం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. మరోవైపు దారులన్నీ ఏకమై కొండగట్టు నిండుతోంది. రాష్ట్రం నలుమాలల నుంచి తరలిస్తున్న వేలాది మంది దీక్షాదారులతో ఇప్పటికే కాషాయమయమైంది. హానుమాన్, […]

అంజన్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2019 | 4:11 PM

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి దీక్షాపరులపైకి లారీ దూసుకెళ్లింది. వీరంతా కొండగట్టు అంజన్న దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో అరుణ్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా.. రాజేందర్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. వీరిద్దరూ చొప్పదండి మండలం బూపాలపట్నం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.

మరోవైపు దారులన్నీ ఏకమై కొండగట్టు నిండుతోంది. రాష్ట్రం నలుమాలల నుంచి తరలిస్తున్న వేలాది మంది దీక్షాదారులతో ఇప్పటికే కాషాయమయమైంది. హానుమాన్, రామనామ సంకీర్తనలతో మార్మోగిపోతోంది. ఆంజనేయస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న చిన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు సుమారు 20వేల మంది అంజన్న స్వాములు మూల విరమణ చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. ఇవాళ జయంతి సందర్భంగా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా దీక్షాపరులు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొండగట్టుకు చేరుకుంటున్నారు.