మహా సర్కార్‌లో టెన్షన్‌ టెన్షన్.. ఉద్ధవ్‌ కోసం మంత్రివర్గం పాట్లు..

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ప్రస్తుతం పదవీ గండం టెన్షన్‌ నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు కావొస్తున్నా.. ఆయన మాత్రం అటు అసెంబ్లీకి గానీ.. ఇటు మండలికి కానీ ఏంటర్‌ అవ్వలేదు. దీంతో మహారాష్ట్ర శాసనసభ కౌన్సిల్‌లో సభ్యుడిగా సీఎం ఉద్ధవ్ థాక్రేను నియమించాలని ఆ రాష్ట్ర కేబినెట్‌ మరోసారి తీర్మానం చేసింది. ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న సీటులో ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ భగత్‌ […]

మహా సర్కార్‌లో టెన్షన్‌ టెన్షన్.. ఉద్ధవ్‌ కోసం మంత్రివర్గం పాట్లు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 28, 2020 | 3:00 PM

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు ప్రస్తుతం పదవీ గండం టెన్షన్‌ నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఆరు నెలలు కావొస్తున్నా.. ఆయన మాత్రం అటు అసెంబ్లీకి గానీ.. ఇటు మండలికి కానీ ఏంటర్‌ అవ్వలేదు. దీంతో మహారాష్ట్ర శాసనసభ కౌన్సిల్‌లో సభ్యుడిగా సీఎం ఉద్ధవ్ థాక్రేను నియమించాలని ఆ రాష్ట్ర కేబినెట్‌ మరోసారి తీర్మానం చేసింది. ప్రస్తుతం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న సీటులో ఉద్ధవ్ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలని కేబినెట్‌ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీకి పంపించారు. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తెలిపారు. ఇప్పటికే ఇదే నెలలో 9వ తేదీన కూడా ఉద్దవ్‌ థాక్రేను ఎమ్మెల్సీగా నియమించాలంటూ మహా కేబినెట్ తీర్మానం చేసింది. అప్పుడు కూడా తీర్మానాన్ని గవర్నర్‌కు పంపించింది. అయితే గవర్నర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. మరోసారి కేబినెట్‌ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం.. ఉభయ సభల్లో సభ్యులు కానీ వారు ఎవరైనా మంత్రిగా లేదా.. ముఖ్యమంత్రిగా అయితే.. సదరు వ్యక్తి ఆరు మాసాల్లో ఉభయ సభల్లో ఏదో ఒకచోట సభ్యుడిగా ఎన్నికవ్వాలి. లేదంటే ఆ పదవికి అనర్హుడిగా మిగులుతారు. అయితే ఇప్పుడు మహా సీఎం ఉద్దవ్‌కు కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. మే 28వ తేదీ నాటికి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఆరు మాసాలు కంప్లీట్‌ అవ్వనుంది. అప్పటి లోగా ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడాలి. లేని పక్షంలో ఉద్దవ్‌ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.