మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష

Madhya pradesh government in danger, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు అగ్ని పరీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి లభించిన భారీ విజయంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికుతోంది. అయితే ఐదు నెలల క్రితం స్వల్ప సీట్ల తేడాతో తమ చేతి నుంచి జారిపోయిన మధ్యప్రదేశ్‌లో మళ్లీ పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉద్దండ నేతలందరూ పరాజితులయ్యారు. జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్ లాంటి కీలక నేతలు ఓటమి పాలయ్యారు. అయితే ఇదే జోష్‌లో బీజేపీ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ నేతలు అసెంబ్లీలో కమల్ నాథ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడింది. దీంతో ముఖ్యమంత్రి కమల్ నాథ్ మంత్రి వర్గంతో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. ఒక్కో మంత్రి కనీసం 5గురు ఎమ్మెల్యేలను పర్యవేక్షించాలని కోరారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 సీట్లకు గాను 114 సీట్లలో విజయం సాధించగా, మేజిక్ ఫిగర్ కు 2 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ఎస్పీకి చెందిన ఒక ఎమ్మెల్యే, బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతునివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారుతారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే ప్రతిపక్ష నేత గోపాల భార్గవ సైతం కమల్ నాథ్ ప్రభుత్వం బలనిరూపించుకోవాలని గవర్నర్ కు లేఖ రాశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలైనా ముగియకుండానే అగ్నిపరీక్ష ఎదుర్కోబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *