Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • విశాఖ: ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం.. మరొకరి మృతి. కనకరాజు అనే వ్యక్తికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రుకి తరలిస్తుండగా మృతి. ఘటన జరిగిన సమయంలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి కోలుకుమ్మ కనకరాజు. 2 రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ కనకరాజు మృతి. విషవాయువు ప్రభావం వల్లే కనకరాజు మృతిచెందాడంటున్న బంధువులు. మృతదేహం మార్చురీకి తరలింపు.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

కాలేజీ అమ్మాయిలకు డ్రెస్ కోడ్.. పెళ్ళికి లింక్ ! ఇదేం వివక్ష ?

long kurtis will fetch good marriage proposals girls college in hyd. bans, కాలేజీ అమ్మాయిలకు డ్రెస్ కోడ్.. పెళ్ళికి లింక్ ! ఇదేం వివక్ష ?

తమ కాలేజీలో చదివే విద్యార్థినులకు హైదరాబాద్ లోని ఓ మహిళా కళాశాల డ్రెస్ కోడ్ కు సంబంధించి వినూత్న నిబంధన విధించింది. ఈ కొత్త నిబంధన కింద వారు తమ మోకాళ్ళ కింది వరకు తప్పనిసరిగా కుర్తీస్ ధరించాలని ఆదేశించింది. అలాగే షార్ట్ లు, స్లీవ్ లెస్ బ్లౌజులు, ఇలాంటి ఇతర డ్రెస్సులు ధరించి కళాశాలకు రాకూడదని కూడా కోరింది. ఒకవేళ ఈ విధమైన ‘ అసభ్యకరమైన ‘ డ్రెస్సులు ద్గరించి వస్తే వారిని కళాశాల ఆవరణలోని అనుమతించబోమని ప్రకటించింది. ఇంతకీ ఈ రూల్ తెచ్చిన కాలేజీ ఏది ? అదే సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ ! నగరంలో మంచి పేరున్న ఈ కాలేజీ..ఇది ! తమ కళాశాలలో చదివే విద్యార్థినులు ఈ రూల్ తప్పనిసారిగా పాటించాలని అంటూ కాలేజీ యాజమాన్యం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నిబంధన కారణంగా చాలామంది విద్యార్థినులు తమ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారు. (ఆగస్టు 1 నుంచి యాజమాన్యం ఈ రూల్ ని అమల్లోకి తెచ్చింది).
ఇంతకీ, ఇలా సరికొత్త గైడ్ లైన్స్ జారీ చేయడానికి యాజమాన్యం చెబుతున్న కారణం వింతగా ఉంది. శరీరం నిండుగా.. మోకాలి కిందివరకు లాంగ్ కుర్తీస్ ధరిస్తే వారికి మంచి పెళ్లి సంబంధాలు వస్తాయట. మొదట స్టడీస్ లో తమ ప్రతిభ, వికాసం వంటివాటిని పరిగణన లోకి తీసుకోవాలి తప్ప ఈ విధమైన కఠిన నిబంధనలు పెట్టడమేమిటని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. డ్రెస్ కోడ్ అమలు విషయంలో మేనేజ్ మెంట్ అనుసరిస్తున్న విధానం తాలూకు వీడియోను కొంతమంది గర్ల్ స్తూడెంట్స్ వీడియో తీసి రిలీజ్ చేశారు. ఈ నిబంధన నిరంకుశంగా, కాలం చెల్లినదిగా ఉందని వారు దుయ్యబడుతున్నారు. ఓ వైపు మనం మహిళా సాధికారత గురించి మనం మాట్లాడుకుంటుంటే మరోవైపు ఇలాంటి ‘ అనాగరిక నిబంధన ‘ ఏమిటని వారు అంటున్నారు.

అయితే ఓ ‘ మంచి కారణం లేదా ప్రయోజనం కోసం మేము ప్రయత్నిస్తుంటే దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తడం దైవ దూషణ వంటిదే ‘ అని కాలేజీ యాజమాన్యం పెద్ద పెద్ద పదాలను వల్లె వేస్తోంది. కాలేజీ అధికారుల పోకడను జొనోబియా అనే విద్యార్థిని ఖండిస్తూ.. విద్యార్థినుల కుర్తీస్ కొంత పొట్టిగా ఉన్నా వారిని కాలేజీలోకి అనుమతించడంలేదని, వేధిస్తున్నారని తన ఫేస్ బుక్ లో కామెంట్ పోస్ట్ చేసింది. పైగా కుర్తీస్ పొడవును కొలిచేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులను కూడా నియమించడాన్ని ఆమె తప్పు పట్టింది. ఈ రూల్ కు వ్యతిరేకంగా సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని విద్యార్థినులు నిర్ణయించారు.

కాగా-కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు డ్రెస్ కోడ్ అమలు చేయడమన్నది వివక్ష చూపేదిగా ఉందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నీకల్ ఎడ్యుకేషన్ గతంలోనే జారీ చేసిన రెండు వెర్వేరు నోటిఫికేషన్లలో పేర్కొన్నాయి. మగ విద్యార్థులకు, వీరికి ఇలా వేర్వేరు రూల్స్ విధించడంలోని ఔచిత్యాన్ని ఈ సంస్థలు ప్రశ్నిచాయి. డ్రెస్ కోడ్ అన్నది విద్యార్థులు స్వేఛ్చను హరించేదిగా ఉండరాదని ఇవి సూచించాయి. అసభ్యంగా ఉండనంతవరకు వారు ఏ విధమైన డ్రెస్ అయినా ధరించాలన్నది ఈ సంస్థల వాదన.. సెక్ష్యువల్ హరాస్ మెంట్ కు చెక్ పెట్టేందుకు ఇలాంటి నిబంధన విధిస్తున్నామని కొన్ని విద్యాసంస్థలు చెబుతున్నప్పటికీ. ఇది వివక్షాపూరితమేనని విద్యార్థినుల తలిదండ్రులు కూడా అభిప్రాయపడుతున్నారు. .

Related Tags