Telugu News Lifestyle Winter care tips for pregnant women: Precautions to be taken by pregnant women during winter season
Winter care tips: చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..
శీతాకాలం వచ్చేసింది. చలి జోరందుకుంటోంది. ఈ కాలంలో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు కూడా ఊపందుకుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతోపాటు, రోజు వారీ అలవాట్లు కూడా..
శీతాకాలం వచ్చేసింది. చలి జోరందుకుంటోంది. ఈ కాలంలో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు కూడా ఊపందుకుంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతోపాటు, రోజు వారీ అలవాట్లు కూడా మారిపోతుంటాయి. ఈ కాలంలో ఉదయాన్నే నిద్రలేవాలంటే ఎక్కడలేని బద్దకం కమ్మేస్తోంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు శీతాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భిణీ స్ర్తీలు మాత్రమేకాకుండా, ప్రతి ఒక్కరూ చలికాలంలో అధికంగా నీళ్లు తాగాలి. తద్వారా శరీరానికి సరిపడా నీళ్లు అందుతాయి. ఫలితంగా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తదినన్ని నీళ్లు తాగుతుండాలి.
చలికాలంలో గర్భిణీ స్త్రీలు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. కొబ్బరినీళ్లు, జ్యూస్‌లు తాగడం మంచిది.
చలికాలంలో జబ్బులు రాకుండా ఉండాలంటే తరచూ సబ్బుతో చేతులు కడుక్కుంటూ ఉండాలి.
అనారోగ్యంతో ఉన్న వారికి గర్భిణి స్త్రీలు దూరంగా ఉండటం మంచిది.
రోజూ క్రమం తప్పకుండా చిన్నపాటి యోగాలు చేస్తుండాలి.
సమయానికి ఆహారం తీసుకోవాలి.
కంటికి సరిపడా నిద్రపోవాలి.
ఉదయం, సాయంత్రం వేళల్లో లేలేత సూర్య కిరణాలు పడే సమయంలో ఎండలో కాసేపు ఉండాలి. ఫలితంగా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది.
అలాగే ఇతర చర్మ సమస్యలు తలెత్తకుండా శరీరానికి తత్వానికి నప్పే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.