Smartphone Charger: స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్లు తెల్లగానే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ దాదాపు ప్రతి కంపెనీ ఛార్జర్‌లు, వాటి కేబుల్‌లు మాత్రం తెల్లగానే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు చాలా రంగులలో వచ్చినప్పటికీ, ఛార్జర్‌లు ఎల్లప్పుడూ తెల్లగానే ఎందుకు ఉంటాయో మనలో చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది. ఇది కేవలం యాదృచ్చికం మాత్రం కానేకాదు..

Smartphone Charger: స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్లు తెల్లగానే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Smartphone Chargers

Updated on: Sep 18, 2025 | 7:01 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఒక భాగంగా మారాయి. అయితే మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌లు అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ దాదాపు ప్రతి కంపెనీ ఛార్జర్‌లు, వాటి కేబుల్‌లు మాత్రం తెల్లగానే ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లు చాలా రంగులలో వచ్చినప్పటికీ, ఛార్జర్‌లు ఎల్లప్పుడూ తెల్లగానే ఎందుకు ఉంటాయో మనలో చాలా మందికి సందేహం వచ్చి ఉంటుంది. ఇది కేవలం యాదృచ్చికం కాదు. దీని వెనుక ఓ సైన్స్‌ రహస్యం ఉంది. తెలుపు రంగు శుభ్రమైన, ప్రీమియం రూపాన్ని ఇస్తుంది. అందువల్ల ఛార్జర్ ప్రీమియం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆపిల్ వంటి కంపెనీలు తెలుపు రంగును ఉపయోగించడం ద్వారా వారి ఉత్పత్తులకు భిన్నమైన గుర్తింపు వచ్చింది. అందుకే ఇతర కంపెనీలు కూడా తెలుపు రంగును ఎంచుకోవడం ప్రారంభించాయి. తద్వారా వారి ఛార్జర్‌లు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

ఫోన్‌లను ఛార్జ్ చేసినప్పుడు ఛార్జర్‌ వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. మీరు తెల్లటి ఛార్జర్‌ని ఉపయోగిస్తుంటే తెలుపు రంగు వేడిని త్వరగా ప్రభావితం చేయదు. ఇది ఛార్జర్‌ను తక్కువ వేడిగా చేస్తుంది. ఛార్జర్‌ వేడెక్కకుండా కాపాడుతుంది. ఇందుకు భిన్నంగా నలుపు లేదా ఇతర ముదురు రంగు ఛార్జర్‌లు త్వరగా వేడిని గ్రహిస్తాయి. ఇవి త్వరగా వేడెక్కి, వాటి పనితీరును ప్రభావితం చేస్తాయి. ఛార్జర్లను తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ తెలుపు రంగులో ఉంటుంది. అందువల్ల కంపెనీలు తెల్లటి ఛార్జర్లను తయారు చేయడానికి అదనపు రంగులు వేయడం, ప్రాసెసింగ్ చేయవలసిన అవసరం లేదు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు కూడా తగ్గుతాయి.

అంతేకాకుండా తెల్లటి ఛార్జర్‌పై ధూళి, గీతలు, కాలిన గుర్తులు ఉంటే వెంటనే కనిపిస్తాయి. కాబట్టి ఛార్జర్ దెబ్బతిన్నా, ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భద్రతకు సంకేతం. ఇక నలుపు లేదా ఇతర ముదురు రంగు ఛార్జర్‌పై ఇటువంటి గుర్తులు వెంటనే కనిపించవు. దీని కారణంగా ప్రమాదం సకాలంలో గుర్తించలేము. తెలుపు రంగు శాంతి, సరళత, నమ్మకానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అందుకే చాలా కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్‌లో భాగంగా తెలుపు రంగును ఉపయోగిస్తుంటాయి. ఆపిల్ తెల్లటి ఛార్జర్‌లు, కేబుల్‌లను తమ బ్రాండ్ గుర్తింపుగా మార్చేసుకుంది. ఇక ఇదే స్టైల్‌ను ప్రస్తుతం అన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. అలాగని బ్లాక్ ఛార్జర్లు చెడ్డవని చెప్పడం మా ఉద్దేశ్యం కాదు. చాలా కంపెనీలు తెలుపు రంగును ఇష్టపడటం కారణంగా అదే రంగు ఛార్జర్లను తయారు చేస్తున్నాయి. అందుకే మార్కెట్లో వైట్ ఛార్జర్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్‌ చేయండి.