Dogs: కుక్కలు వాహనాల వెనుక ఎందుకు పడతాయో మీకు తెలుసా? అసలు కారణాలు ఇవే!

Dogs: కుక్కలకు వాసనను పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. అవి మనుషుల వద్దకు వెళ్లినా.. లేదా వాహనాల వద్దకు వెళ్లినా.. వాసన చూడటాన్ని మనం గమనించొచ్చు. ఇతర కుక్కలను కూడా ఇలా వాసన గ్రహించి, గుర్తు పెట్టుకుంటాయట. అయితే.. మనం కారు లేదా..

Dogs: కుక్కలు వాహనాల వెనుక ఎందుకు పడతాయో మీకు తెలుసా? అసలు కారణాలు ఇవే!
Dog

Updated on: Apr 13, 2026 | 2:58 PM

Dogs: మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా కుక్కలు బైక్ లేదా కారు వెనుక పడటం చూస్తుంటాం. కొన్నిసార్లు ఇది చాలా భయాన్ని కలిగిస్తుంది. అయితే కుక్కలు ఇలా ఎందుకు చేస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ప్రధానంగా మూడు ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి.

వేటాడే నైజం:

కుక్కలకు పుట్టుకతోనే వేటాడే లక్షణం ఉంటుంది. ప్రకృతిలో వేగంగా కదిలే ఏ వస్తువునైనా అవి ఒక వేటగా భావిస్తాయి. బైక్ లేదా కారు వేగంగా వెళ్తున్నప్పుడు, వాటి మెదడుకు అది ఒక జంతువు పారిపోతుందనే సిగ్నల్ అందుతుంది. అందుకే అవి తెలియకుండానే ఆ వాహనాలను వెంటాడుతాయి

ఇది కూడా చదవండి: Aadhaar Card: మన దేశంలో ఆధార్‌ ఎలా వచ్చింది..? కార్డు వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు?

ఇవి కూడా చదవండి

తమ పరిధిని కాపాడుకోవడం:

కుక్కలు తాము నివసించే ఏరియాను ఒక సామ్రాజ్యంగా భావిస్తాయి. ఏదైనా కొత్త వాహనం తమ ఏరియాలోకి వచ్చినప్పుడు, అది తమకు లేదా తమ సామ్రాజ్యానికి ముప్పు అని భావించి, ఆ వాహనాన్ని భయపెట్టి పంపించేయడానికి ప్రయత్నిస్తాయి.

సరదా కోసం :

కేవలం కోపం లేదా భయం వల్ల మాత్రమే కాదు, కొన్నిసార్లు కుక్కలకు బోర్ కొట్టినప్పుడు కేవలం సరదా కోసం లేదా కాలక్షేపం కోసం కూడా వాహనాల వెనుక పడుతుంటాయి. అలాగే  కుక్కలకు వాసనను పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. అవి మనుషుల వద్దకు వెళ్లినా.. లేదా వాహనాల వద్దకు వెళ్లినా.. వాసన చూడటాన్ని మనం గమనించొచ్చు. ఇతర కుక్కలను కూడా ఇలా వాసన గ్రహించి, గుర్తు పెట్టుకుంటాయట. అయితే.. మనం కారు లేదా బైక్‌ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు, కుక్కలు వాహనాల టైర్లపై మూత్రవిసర్జన చేస్తాయి. ఆ వాహనంపై మనం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. అక్కడి కుక్కలు దూరం నుంచే ఈ వాసన పసిగడతాయట. దాంతో.. వేరే ప్రాంతానికి చెందిన కుక్కలు తమ ప్రాంతానికి వస్తున్నాయని భావిస్తాయట. అందుకే.. ఆ వాహనం వెంట ఆరుస్తూ పరుగులు తీస్తాయని జంతు పరిశోధకులు చెబుతున్నారు.అందుకే కుక్కలు మీ వాహనం వెనుక పడితే అవి మిమ్మల్ని కరవాలనే ఉద్దేశంతో కాకుండా, పై కారణాల వల్ల అలా చేస్తుంటాయని గ్రహించాలి.

ఇది కూడా చదవండి: Best Coolers: ఏ కూలర్ వాడితే గది ఏసీలా చల్లబడుతుంది? విద్యుత్ ఆదా చేసే కూలర్ ఏదో తెలుసుకోండి!

Agricultural Land Tax Rules: వ్యవసాయ భూమి అమ్మకంపై కూడా ఆదాయపు పన్ను వర్తిస్తుందా? నిబంధనలు తెలుసా?

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us