
ప్రపంచవ్యాప్తంగా నాన్-వెజ్ ప్రియులకు చికెన్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా బాయిలర్ కోడి మాంసం రోజూ లక్షలాది మంది ఇళ్లలో వంటకాల్లో భాగమవుతోంది. చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, బాయిలర్ కోడిని తినేటప్పుడు మనం ఏ భాగాలను ఎంచుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల ప్రకారం, బాయిలర్ కోడి శరీరంలోని కొన్ని నిర్దిష్ట భాగాలను తినడం ఆరోగ్యానికి హానికరం. ఆ భాగాలు ఏంటి, వాటిని ఎందుకు తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
చాలా మంది హోటళ్లలో లేదా ఇళ్లలో చికెన్ తినేటప్పుడు కోడి మెడ భాగాన్ని ఇష్టంగా తింటుంటారు. కానీ బాయిలర్ కోళ్లను పెంచే సమయంలో వాటికి ఇచ్చే యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్లు, రసాయనాలు ఆ కోడి శరీరంలో ప్రవహిస్తాయి. కోడి మెడ భాగంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి, ఇవి శరీరంలోని విష పదార్థాలను ఫిల్టర్ చేసే కేంద్రాలుగా పనిచేస్తాయి. కాబట్టి, ఈ భాగంలో హానికరమైన రసాయనాలు పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువ. వీటిని తింటే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
కాలేయం అనేది జీవుల శరీరంలో విషాన్ని తొలగించే ముఖ్యమైన అవయవం. బాయిలర్ కోళ్లకు వేసే కృత్రిమ దాణా, రసాయన మందులు, యాంటీబయోటిక్స్ అన్నీ చివరికి కాలేయంలోనే నిల్వ అవుతాయి. కాలేయంలో విటమిన్లు, ఐరన్ ఉన్నప్పటికీ, బాయిలర్ కోళ్ల విషయంలో మాత్రం ఇది విషపూరిత అవశేషాలకు కేంద్రంగా మారుతుంది. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్స్ పెరిగిపోయి, కాలేయ పనితీరు మందగించడం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వీలైనంత వరకు ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన నాటు కోడి లేదా సర్టిఫైడ్ బాయిలర్ చికెన్‌ను ఎంచుకోవడం మంచిది. చికెన్ తినేటప్పుడు బ్రెస్ట్ పీస్ లేదా లెగ్ పీస్ వంటి కండ ఉండే భాగాలను మితంగా తీసుకోవడం సురక్షితం. మెడ, కాలేయం, ఇతర అంతర్గత అవయవాలను పూర్తిగా దూరంగా ఉంచడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. రుచి కోసం ప్రమాదకరమైన భాగాలను తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకోకుండా, సరైన ఆహారపు అలవాట్లను పాటించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..