
చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్ వెజ్ ప్రియులకు మటన్ అంటే చాలా ఇష్టం. మటన్‌కి ఉన్న ప్రత్యేకమైన రుచే దాన్ని క్రేజ్‌కు కారణం. మటన్ విటమిన్లు, ప్రోటీన్ల నిధిగా చెప్తారు. కానీ ఏ భాగం తింటే ఎక్కువ బలం..? ఎక్కువ పోషకాలు వస్తాయి..? అనేది చాలామందికి తెలీదు. మటన్ తినేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు చూద్దాం..
మటన్ అనేది ప్రోటీన్లకు, విటమిన్లకు పెద్ద స్టోర్ హౌస్. మీరు 100 గ్రాముల మటన్ తింటే మీ రోజు మొత్తంలో కావాల్సిన ప్రోటీన్‌లో 60శాతం వరకు వచ్చేస్తుంది. 100 గ్రాముల మటన్‌లో సుమారు 33 గ్రాముల ప్రోటీన్ అఉంటుంది. మాంసం తిననివాళ్లలో తరచుగా విటమిన్ B12 లోపం కనిపిస్తుంది. కానీ మటన్ తినేవాళ్లకు ఈ విటమిన్ చాలా దొరుకుతుంది. ఇందులో ఐరన్, మంచి కేలరీల శక్తి కూడా పుష్కలంగా ఉంటాయి. మీరు ప్రత్యేకంగా విటమిన్ల కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా మటన్ మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
మటన్ కొనేప్పుడు రుచి, పోషకాలు రెండూ కావాలంటే ఈ రెండు విషయాలు చూడాలి:
మేక వయసు: బాగా చిన్న మేక లేదా బాగా ముసలి మేక కంటే మధ్య వయసు మేక మాంసం చాలా మంచిది. దాదాపు 8 నుంచి 10 కిలోల బరువున్న మేకను ఎంచుకోవాలని నిపుణులు అంటున్నారు.
మాంసం-ఎముక: కూర కోసం మటన్ తీసుకుంటే మాంసం 70శాతం, ఎముకలు 30శాతం ఉండేలా చూసుకోండి.
సాధారణంగా అన్ని భాగాలు పోషకమైనవే అయిన`ప్పటికీ కొన్ని భాగాల్లో ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు అత్యధికంగా ఉంటాయని నిపుణులు నిర్ధారించారు. లివర్, ముందు కాళ్ళు , గొంతు , పక్కటెముకలు, ఛాతీ భాగం, గుండె, మెదడు వంటి వాటిలో ఎక్కువ పోషకాలు ఎక్కువ. మొత్తం మీద మటన్ తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే విషయం అయినప్పటికీ నిపుణుల సలహాల మేరకు నాణ్యమైన, సరైన వయసు గల మేక మాంసాన్ని ఎంచుకోవడం ద్వారా గరిష్ట పోషక ప్రయోజనాలను పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..