AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక కిలో బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు నడవాలి..? ఈ లెక్కలు తెలిస్తే అవాక్కే..

Walking for Weight Loss: బరువు తగ్గడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఇంటర్నెట్‌లో దొరికే రకరకాల పద్ధతులు ప్రయత్నించి అలసిపోయారా..? అయితే మీకోసం ఒక సింపుల్ అండ్ బెస్ట్ సొల్యూషన్ ఉంది.. అదే వాకింగ్.. కానీ ఊరికే అలా నడిస్తే సరిపోదు.. దానికి ఒక లెక్క ఉంది. రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? ఒక కిలో తగ్గడానికి ఎంత నడవాలి..? అనేది తెలుసుకుందాం..

ఒక కిలో బరువు తగ్గడానికి ఎన్ని అడుగులు నడవాలి..? ఈ లెక్కలు తెలిస్తే అవాక్కే..
Walking For Weight Loss
Krishna S
|

Updated on: Feb 04, 2026 | 6:55 PM

Share

ప్రస్తుతం మన దేశంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. బరువు తగ్గడానికి జిమ్‌లు, కఠినమైన డైట్లు ఎన్ని ఉన్నా.. వీటన్నింటికంటే అత్యంత సులభమైన, ఖర్చు లేని మార్గం నడక. అయితే కేవలం నడిస్తే సరిపోతుందా? బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవాలి? ఆ అడుగులను కేలరీల లెక్కల్లోకి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

10,000 అడుగుల లక్ష్యం – అసలు లెక్క ఏంటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి సుమారు 1 కిలో బరువు తగ్గాలంటే 3,500 కేలరీలు ఖర్చు చేయాలి. సాధారణంగా ఆరోగ్యవంతులైన వారు 2,000 అడుగులు నడిస్తే 100 కేలరీలు బర్న్ అవుతాయి. అంటే మీరు రోజుకు 10,000 అడుగులు నడవగలిగితే, సుమారు 500 కేలరీలు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా వారానికి 7 రోజులు చేస్తే.. మీరు 3,500 కేలరీలు ఖర్చు చేసి ఒక వారంలో దాదాపు 0.5 నుండి 1 కిలో బరువును ఆరోగ్యకరంగా తగ్గవచ్చు.

ఒకేసారి నడవాలా? విభజించాలా?

చాలామంది ఉత్సాహంతో మొదటి రోజే గంటల తరబడి నడిచేస్తారు. కానీ అది కండరాల నొప్పులకు దారితీస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. మొదట రోజుకు 2,000 అడుగులతో ప్రారంభించి.. ప్రతి వారం ఆ సంఖ్యను పెంచుకుంటూ 10,000 లక్ష్యాన్ని చేరుకోవాలి. 10,000 అడుగులను ఒకేసారి కాకుండా చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఉదాహరణకు ఉదయం నిద్రలేవగానే ఒక చిన్న వాక్, ఆఫీసులో లిఫ్ట్‌కు బదులు మెట్లు వాడటం, రాత్రి భోజనం తర్వాత 15 నిమిషాల నడక.. ఇలా చేస్తే రోజు చివరికి లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

నడకతో పాటు డైట్ కంట్రోల్ తప్పనిసరి

నడక ఒక్కటే బరువు తగ్గడానికి సరిపోదు. మీరు నడిచి 500 కేలరీలు ఖర్చు చేసినా, తిరిగి అంతే మొత్తంలో జంక్ ఫుడ్ తింటే ఫలితం ఉండదు. మీరు తీసుకునే ఆహారంలో కనీసం 500 కేలరీలు తగ్గించుకోవాలని అధ్యయనాలు చెబుతున్నాయి. వైద్యులు సిఫార్సు చేసిన పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా లేకుండా డైట్ మార్చకూడదు. నడక కేవలం బరువు తగ్గడానికే కాదు.. గుండె పనితీరును మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి కూడా తోడ్పడుతుంది. నడకతో పాటు వారానికి రెండు సార్లు చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..