Lifestyle: కలయిక తర్వాత.. ఇలాంటి సమస్యలా?… అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు

మన సాధారణ జీవితం బాగుండాలంటే శృంగార పరంగానూ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. పీసీడీ సమస్య ఇప్పుడు చాలామందిని వేధిస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి..? ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం....

Lifestyle: కలయిక తర్వాత.. ఇలాంటి సమస్యలా?... అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు
Couple
Follow us

|

Updated on: Jul 21, 2024 | 3:09 PM

భార్యాభర్తల మధ్య బాండింగ్ పెరగడానికి శృంగారం గొప్ప సాధనం.  కలయిక తర్వాత ఇద్దరూ ఏకమైన భావన కలగడంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కానీ కొంతమంది శృంగారం తర్వాత సంతోషానికి బదులు… చిరాకు, యాంగ్జైటీ, ఒత్తిడి, అపరాధ భావంతో కుంగిపోవడం.. వంటి పలు మెంటల్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు నిపుణులు పరిశోధనల్లో తేలింది. ఇందుకు కారణాలు ఇవి అనే చెప్పలేం కానీ.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. భార్యాభర్తల మధ్య బాండింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. కపుల్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కలయిక తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. ఒకరితో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. కానీ కలయిక తర్వాత ముభావంగా మారిపోవడం, ఒత్తిడి ఉంటే..  ఆ పరిస్థితిని ‘Postcoital Dysphoria (PCD)’గా చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రాబ్లం ఉన్న అందరిలో ఒకే రకమైన లక్షణాలు ఉండకపోవచ్చు.

  • శృంగారంలో పాల్గొనాలంటే కపుల్ శారీరకంగానే కాదు.. మెంటల్‌గానూ రెడీ అవ్వాల్సి ఉంటుంది.  అలా జరక్కపోతే  కలయిక తర్వాత పీసీడీ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది.
  • శృంగారం విషయంలో కొంతమంది పార్టనర్ ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా బలవంతం చేస్తుంటారు. దీనివల్ల కూడా సంభోగం తర్వాత ఒక రకమైన మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది.
  • భార్యాభర్తల మధ్య ఎప్పుడూ డిఫరెన్సెస్ ఉండటం, వాటికి చెక్ పెట్టకపోవడం.. ఇలా ఇద్దరి మధ్య ఎమోషనల్గా పెరిగిపోయిన గ్యాప్ కూడా.. శృంగారాన్ని ఆస్వాదించకుండా చేస్తుందంటున్నారు నిపుణులు.
  • లైంగిక వేధింపులు.. వంటి గత జ్ఞాపకాల వల్ల కూడా కొంతమంది తమ పార్టనర్‌తో కలయికను ఆస్వాదించలేకపోతారన్నది నిపుణులు వెర్షన్
  • నెలసరిలో ఉన్నప్పుడు హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొన్నా కొంతమందిలో PCD తరహా మానసిక సమస్యలొచ్చే చాన్సులు ఎక్కువంటున్నారు నిపుణులు.
  • ఫ్యాంటసీలు, లైంగిక కోరికలు.. డిస్కస్ చేయకపోవడం… భాగస్వామిని శాటిస్‌ఫై చేయలేకపోయానన్న భావన.. మొదలైనవి కూడా ఇబ్బందికి  గురి చేస్తాయంటున్నారు నిపుణులు.
  • కలయిక తర్వాత పలు అంశాల్లో పార్టనర్‌ను బ్లేమ్ చేయడం వల్ల కూడా కొంతమంది మెంటల్‌గా ఇబ్బంది పడతారు
  • పెళ్లికి ముందు వివిధ రీజన్స్ వల్ల వల్ల డిప్రెషన్‌, ఒత్తిడి-యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల్ని ఎదుర్కోవడం, ఫ్యామిలీలో ఎవరికైనా మానసిక సమస్యలుండడం.. వంటివి కూడా PCDకి దారితీస్తాయట

మానసిక వేదనను అనుభవించడం, ఏదో తెలియని బాధ, నిత్యం ముభావంగా ఉండటం, కోపం కట్టలు తెంచుకోవడం, అకారణంగా పార్టనర్‌పై అరవడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, ఉన్నట్లుండి బిగ్గరగా ఏడ్చేయడం, తెలియని బాధ, భయం వెంటాడడం, కలయిక తర్వాత అపరాధ భావంతో, సిగ్గుతో కుంగిపోవడం.. వంటి PCD లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు ముదిరితే పలు ఆరోగ్య సమస్యలతో పాటు.. దాంపత్య బంధానికి కూడా బీటలు వారే అవకాశం ఉంది.

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం, ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం వల్ల ఈ లక్షణాల నుంచి స్వాంతన లభిస్తుంది. అలానే మంచి నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. మనసులో ఏ ఫీలింగ్‌ ఉన్నా పార్టనర్‌తో పంచుకోవాలి. అన్ని విషయాల్లోనూ నిజాయితీగా వ్వవహరిస్తూ.. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. మీకంటూ ఒకరున్నారన్న భరోసా ఇస్తే.. ఇద్దరి మధ్య గ్యాప్ అనేదే రాదు. లైంగిక కోరికలు, ఫ్యాంటసీలను కూడా ఒకరికొకరు చెప్పుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోతే మాత్రం.. మానసిక నిపుణుల్ని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

శృంగారం తర్వాత కొందరిలో భిన్నమైన భావాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
శృంగారం తర్వాత కొందరిలో భిన్నమైన భావాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
భారత్‌లో గరిష్ట స్థాయికి విదేశీ మారకం నిల్వలు.. అదే దారిలో బంగారం
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
ఇష్టమొచ్చినట్లు తిట్టారు.. చేతబడి చేశానన్నారు.. హీరోయిన్..
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్‌ను అనుకున్నారట
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
జియో సరికొత్త రికార్డ్‌.. చైనా కంపెనీలను వెనక్కి నెట్టి మరీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
సౌందర్య చీర కలర్ చేంజ్ గురించి అసలు సీక్రెట్ చెప్పిన కృష్ణవంశీ..
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్‌ సేల్‌లో భారీ ఆఫర్
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ
లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్‌సీబీ