గ్యాస్ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!
TV9 Telugu
21 July 2024
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ప్రజలు సిలిండర్ ఉపయోగిస్తూ ఉంటారు. వంట కోసం, గీజర్లకు గ్యాస్ ఉపయోగపడుతుంది.
అటువంటి పరిస్థితిలో, సిలిండర్ త్వరగా అయిపోకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. దీంతో ఎక్కువ కాలం ఉంటుంది.
మీ ఇంట్లో వంట కోసం వాడుతున్న గ్యాస్ సిలిండర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. అది లీక్ అవుతుందో లేదో చూడండి.
వంట సిలిండర్ చెక్ చేసినపుడు గ్యాస్ లీక్ అవుతున్నట్లు మీకు అనిపిస్తే, రెగ్యులేటర్‌తో దాన్ని ఆపివేయండి.
మీ సిలిండర్‌ను సరిగ్గా ఉపయోగించండి. బర్నర్‌ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. అప్పుడు ఎక్కువ రోజులు వస్తుంది.
మీ ఇంట్లో మీరు ఉపయోగిస్తున్న సిలిండర్‌లో తక్కువ గ్యాస్ ఉంటే, దానిపై తడి పాత్రలను ఎప్పుడూ ఉపయోగించవద్దు.
ఇంట్లో గ్యాస్ స్టవ్ పై కూరగాయలు లేదా ఏదైనా తయారు చేసేటప్పుడు ఎల్లప్పుడూ వాటిపై మూత పెట్టి కవర్ చేయండి.
అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ వెలిగించి పెట్టుకోండి. వంట చేసే సమయంలో అన్ని వస్తువులు దగ్గర పెట్టుకుని వంట ప్రారంభించారు.