పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన
తొలి బిడ్డ పుట్టిన రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ విడాకులు కోరుతూ సంచలనం సృష్టించింది. యువరాణి షైకా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. దుబాయ్ కి చెందిన సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తో యువరాణి షైకా వివాహం 2023 మే 27న జరిగింది. ఇటీవలే షైకా, మనా దంపతులకు తొలి సంతానం కలిగింది.
తొలి బిడ్డ పుట్టిన రెండు నెలలకే దుబాయ్ యువరాణి షైకా మహ్రా మహ్మద్ రషీద్ అల్ మక్తూమ్ విడాకులు కోరుతూ సంచలనం సృష్టించింది. యువరాణి షైకా… యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. దుబాయ్ కి చెందిన సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త షేక్ మనా బిన్ మహ్మద్ అల్ మక్తూమ్ తో యువరాణి షైకా వివాహం 2023 మే 27న జరిగింది. ఇటీవలే షైకా, మనా దంపతులకు తొలి సంతానం కలిగింది. అంతలోనే విడాకులు తీసుకుంటున్నట్టు యువరాణి షైకా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. అది కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ప్రియమైన భర్తకు… మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడుతున్నారు… అందుకే మీ నుంచి విడాకులు తీసుకుంటున్నాను… ఇట్లు మీ మాజీ భార్య అంటూ సంచలన పోస్టు పెట్టారు. కాగా, షైకా, మనా ఇద్దరూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను కూడా డిలీట్ చేసేశారు. దుబాయ్ యువరాణి షైకా బ్రిటన్ లోని ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో స్పెషలైజేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు
అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే
ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్ ఔట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!
యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

