
మీ వివాహ బంధం మరింత బలపడాలంటే, బిజీ లైఫ్ నుండి విరామం తీసుకుని ఒక అందమైన ట్రిప్ వేయాల్సిందే. ఫిబ్రవరిలో భారతదేశంలోని ఏ ప్రాంతాలు హనీమూన్ జంటలకు స్వర్గంలా కనిపిస్తాయో మీకు తెలుసా? రాజస్థాన్ ఎడారి కోటల నుండి గోవా బీచ్‌ల వరకు.. రొమాంటిక్ వైబ్స్ ఇచ్చే 7 బెస్ట్ డెస్టినేషన్స్ గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.
ఫిబ్రవరిలో హనీమూన్ కోసం 7 ఉత్తమ ప్రదేశాలు
లక్షద్వీప్: నిశ్శబ్దమైన బీచ్‌లు, నీలి రంగు సముద్రపు నీరు ఏకాంతాన్ని కోరుకునే జంటలకు ఇది సరైన ఎంపిక. ఇక్కడి ప్రశాంతత మీ ప్రయాణాన్ని మరింత మధురంగా మారుస్తుంది.
గుల్మార్గ్ (కాశ్మీర్): ఫిబ్రవరిలో ఇక్కడ మంచు కురుస్తుంది. తెల్లని మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాల మధ్య గడపడం ప్రతి జంటకు ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది.
జైసల్మార్ (రాజస్థాన్): చలి ప్రదేశాలు ఇష్టం లేని వారు రాజస్థాన్ వెళ్లవచ్చు. ఎడారిలో క్యాంపింగ్, ఒంటె స్వారీ మరియు పురాతన కోటల సందర్శన మీకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
గోవా: ఫిబ్రవరిలో గోవా బీచ్‌లు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. సముద్రంలో డైవింగ్ చేయడం లేదా సాయంత్రం వేళ బీచ్‌లో నడవడం వంటివి మీ ప్రేమను మరింత పెంచుతాయి.
మనాలి (హిమాచల్ ప్రదేశ్): మంచుతో కప్పబడిన కొండ శిఖరాలు మనాలిని స్వర్గంలా మారుస్తాయి. విశ్రాంతి తీసుకోవాలనుకునే జంటలకు ఇది బెస్ట్ డెస్టినేషన్.
మున్నార్ (కేరళ): పచ్చని తేయాకు తోటలు, పొగమంచుతో కప్పబడిన లోయలు కేరళలో మిమ్మల్ని మైమరపిస్తాయి. రొమాంటిక్ వెదర్ కోసం దీనిని ఎంచుకోవచ్చు.
అండమాన్ నికోబార్: స్కూబా డైవింగ్ వంటి సాహసాలు చేయాలనుకునే జంటలకు అండమాన్ ద్వీపాలు సరైన వేదిక.