Lifestyle: సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలకు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. ఇదిలా ఉంటే వేసవిలో పలు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్‌లో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యల బారినపడుతంటారు...

Lifestyle: సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
Dization
Follow us

|

Updated on: Apr 30, 2024 | 5:15 PM

ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలకు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది అడుగు బయటపెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. ఇదిలా ఉంటే వేసవిలో పలు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్‌లో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యల బారినపడుతంటారు. అయితే మనం చేసే తప్పుల కారణంగానే సమ్మర్‌లో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. మరి జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* సమ్మర్‌లో టీ, కాఫీలను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. కాఫీలు, టీలు శరీర ఉష్ణోగ్రత పెరగడానికి కారణమవుతుతాయి. దీంతో శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి సమ్మర్‌లో టీ, కాఫీలకు దూరంగా ఉండడమే మంచిది.

* మసాల ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల పొట్ట సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్‌ సమస్యకు మసాలా ఫుడ్‌ తీసుకోవడమే ప్రధాన కారణం. అందుకే మసాల ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు.

* ఇక చక్కెర కూడా మితంగానే తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతుంటారు. అయితే శరీరంలో చక్కెర కంటెంట్ పెరిగితే శరీరం డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు సమ్మర్‌లో చక్కెర తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

* సమ్మర్‌లో కూల్ బీర్‌ తాగితే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌ వల్ల శరీరంలో డీహైడ్రేషన్‌కు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి.

* ఇక సమ్మర్‌లో నాన్‌వెజ్‌కు కూడా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సమ్మర్‌లో సహజంగానే జీర్ణక్రియ రేటు తగ్గుతుంది. కాబట్టి ఆలస్యంగా జీర్ణమయ్యే నాన్‌ వెజ్‌కు దూరంగా ఉండడం మంచిది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles