సౌత్ లో ప్రసిద్ధి చెందిన నార్త్ ఇండియన్ ఫుడ్స్..

TV9 Telugu

17 May 2024

బటర్ చికెన్ ఢిల్లీకి చెందిన వంటకం. ఈ వంటకం వెన్న, చికెన్ కలిపి తాయారు చేస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు.

చోలే భాతురే వంటకం మూలం ఢిల్లీ అని కొందరు వాదిస్తారు, మరికొందరు మాత్రం దీనిని ఉత్తరప్రదేశ్‌కు ఆపాదించారు.

రాజ్మా చావల్ ఒక రుచికరమైన మసాలా-రుచిగల టొమాటో ఆధారిత గ్రేవీలో వండుతారు, ఇది ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందినది.

ఢిల్లీ నుండి వచ్చిన మరో వంటకం దాల్ మఖానీ. ఈ ప్రధానమైన వంటకంలో ఉరద్ పప్పు మరియు వెన్న కీలక పదార్థాలుగా ఉంటాయి.

తందూరి చికెన్ వెరైటీని చికెన్‌ చాలా మసాలాలు, పెరుగుతో మెరినేట్ చేయడం ద్వారా తయారుచేస్తారు. చాలామందికి ఇష్టమైనది.

పనీర్ టిక్కాను చాలా మంది వెజ్ స్టార్టర్‌గా ఎంచుకుంటారు. పెరుగు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయలతో పనీర్‌ను మ్యారినేట్ చేస్తారు.

ఉత్తర భారతదేశంలోని మరొక ప్రసిద్ధ వంటకం పాలక్ పనీర్. ఈ వంటకం తరచుగా అన్నం లేదా బటర్ నాన్‌తో పాటు వడ్డిస్తారు.

రాస్ మలై పశ్చిమ బెంగాల్ కి చెందిన ప్రసిద్ధ స్వీట్. ఈ స్వీట్‌ను పాలు, ఒక రకమైన చీజ్ బాల్స్‌తో తయారు చేస్తారు.