మధుమేహం.. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య ఎక్కువుతోంది. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, కుటుంబ నేపథ్య కారణంగా డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
రక్తంలో చక్కెర శాతం పెరిగి ఇన్సులిన్ లోపం ఏర్పడినప్పుడు మధుమేహం వస్తుందని అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా శరీరంలోని ఎన్నో భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఒకప్పుడు 55 ఏళ్లు పైబడిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్లలోపు వారిలో కూడా కనిపించడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అయితే మధుమేహంను ముందుగా గుర్తిస్తే ఈ వ్యాధి చికిత్స సులభతరమవుతుందని నిపుణులు చెబుతుంటారు. డయాబెటిస్ ప్రారంభం కాగానే శరీరం కొన్ని రకాల లక్షణాల ద్వారా మనల్ని అలర్ట్ చేస్తుంది. అలాంటి లక్షణాల్లో ఉదయం లేవగానే కనిపించేవి కొన్ని ఉంటాయి. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ వస్తున్న తెలిపే ప్రధాన లక్షణాల్లో దాహం ఒకటని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే విపరీతమైన దాహం వేయడం. నోరు పొడిగా మారడం కూడా డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ లక్షణం కనిపించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల గొంతు ఎండిపోతుంది.
ఇక ఉదయం నిద్రలేచిన వెంటనే కంటి చూపులో ఏమైనా తేడాగా అనిపించినా. కళ్లు మసకబారినట్లు కనిపిస్తున్నా అది డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా కనిపించాలి. అయితే కొన్ని సందర్భాల్లో బీపీ ఎక్కువగా ఉన్న వారిలో కూడా ఇలాంటి లక్షణమే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కంటి చూపులో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయిచుకోవాలి. రాత్రంతా మంచి నిద్ర ఉన్నా, ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా ఉదయం లేచిన వెంటనే తీవ్ర అలసట, నీరసంతో బాధపడుతుంటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగాయని అర్థం చేసుకోవాలి.
ఇక కొందరిలో చేతులు వణుకుతుంటాయి. ఇది కూడా డయాబెటిస్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపునులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలు ఎక్కువైనా, తక్కువైనా ఆకలి వేయడం, చేతులు వణకడం, అధిక చమట వంటి లక్షణాలు కనిపిస్తాయి. పైన తెలిపిన లక్షణాలు ఏవి కనిపించినా ఏమాత్ర ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రందించడం ద్వారా డయాబెటిస్‌ను ముందస్తుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక చేయండి..