గొంతు నొప్పి సర్వసాధారణమైన సమస్య. కాస్త వాతావరణంలో మార్పు కనిపించినా, తాగే నీరు మారినా వెంటనే గొంతి నొప్పి మొదలవుతుంది. అయితే గొంతు నొప్పికి జలుబు, దగ్గు మొదలు ఎన్నో రకాల కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో గొంతు నొప్పిని అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఎక్కువ కాలం గొంతు నొప్పితో బాధపడుతుంటే అది తీవ్ర సమస్యకు సంకేతంగా భావించాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* గొంతు నొప్పి రావడానికి ప్రధాన కారణాల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే.. రుమాటిక్ ఫీవర్, కిడ్నీ వాపు, కిడ్నీలో చీము వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఎక్కువ రోజులు గొంతు సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
* గొంతు నొప్పి ఎక్కువ కాలం ఉంటే అది క్యాన్సర్‌కు లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గొంతు క్యాన్సర్ స్వరపేటిక, ఫారింక్స్ లేదా టాన్సిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయాల్లో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* తీవ్రమైన అలెర్జీల కారణంగా కూడా గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ధుమ్ము, మట్టి లేదా పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా ఈ అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
* ఇక యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి వ్యాధుల కారణంగా కూడా గొంతులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా కడుపులో యాసిడ్ కారణంగా గొంతు నొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆటో ఇమ్యూన్ వ్యాధులలో, ఇది తరచుగా నొప్పిని కూడా కలిగిస్తుంది. గొంతు నొప్పి నుంచి బయటపడాలంటే జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి.
* గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని సహజ చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తేనె, అల్లం వంటి వాటిని తీసుకోవడం. మిరియాల టీ తాగడం వంటి వాటివల్ల గొంతు నొప్పి తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..