Lifestyle: హలో.. వినిపిస్తోందా! వినికిడి సమస్యలకు ఇవే చిట్కాలు..

వినికిడి సమస్య మరెన్నో సమస్యలకు దారి తీస్తుంది. ప్రతీ చర్యకు ప్రతిస్పందించడానికి, నేర్చుకోవడానికి, ఇతరులతో సమర్థవంతంగా సంభాషణలను ఆస్వాదించడానికి ఇలా అన్నింటికీ వినికిడి సరిగ్గా ఉండాల్సిందే. అయితే కొందరిలో పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటే మరికొందరిలో మాత్రం...

Lifestyle: హలో.. వినిపిస్తోందా! వినికిడి సమస్యలకు ఇవే చిట్కాలు..
Hearing Problem

Updated on: Mar 09, 2024 | 4:39 PM

ఇంద్రియాలలో ప్రధానమైన వాటిలో చెవులు కూడా ఒకటి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వినికిడి సమస్య మరెన్నో సమస్యలకు దారి తీస్తుంది. ప్రతీ చర్యకు ప్రతిస్పందించడానికి, నేర్చుకోవడానికి, ఇతరులతో సమర్థవంతంగా సంభాషణలను ఆస్వాదించడానికి ఇలా అన్నింటికీ వినికిడి సరిగ్గా ఉండాల్సిందే. అయితే కొందరిలో పుట్టుకతోనే వినికిడి సమస్య ఉంటే మరికొందరిలో మాత్రం కాలక్రమేణ చేసే తప్పుల కారణంగా వినికిడి సమస్య వెంటాడుతుంది. ఇంతకీ వికినిడి సమస్య దరిచేరకుండా ఉండడానికి, మెరుగైన వినికిడి శక్తి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* వినికిడి సమస్యకు చెక్‌ పెట్టాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బీ12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇనుము , కాల్షియం అధికంగా ఉండాలి. విటమిన్‌ డీ కూడా లభించేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* ప్రతీరోజూ కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల వయస్సుతో పాటు వచ్చి వినికిడి లోపం నుంచి బయటపడొచ్చు.

* ఇక వినికిడి సమస్యకు స్మోకింగ్‌కు సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ స్మోకింగ్‌ వినికిడి లోపాన్ని కారణమవుతుంది నిపునులు చెబుతున్నారు. కాబట్టి సిగరెట్‌ తాగడం, సిగిరెట్ తాగే వాళ్లకు దూరంగా ఉండడం బెటర్‌.

* నిద్రలేమి కారణంగా ఎదురయ్యే మానసిక అనారోగ్యం వినికిడి సామర్థ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రోజులో కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* పెద్ద పెద్ద శబ్ధాలను వినవడం వల్ల కూడా వినికిడి సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో కర్ణభేరి దెబ్బతిని శాశ్వతంగా చెవిటి వచ్చే సమస్య ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో గంటల తరబడి హెడ్‌ ఫోన్స్‌ను ఉపయోగించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

* వినికిడి సమస్యలకు మొదటి స్టేజ్‌లోనే గుర్తిస్తే త్వరగా చికిత్స తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఏడాదికి ఒకసారైనా చెవి పరీక్షలు నిర్వహించుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటే మొదటి దశలోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..