Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.. నోటి క్యాన్సర్‌ కావొచ్చు

అయితే శరీరంలో ఏ క్యాన్సర్‌ కారకాలు ప్రారంభమైనా కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా నోటి క్యాన్సర్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చికిత్స కూడా అంతే సులభంగా ఉంటుంది. క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మరి నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే...

Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.. నోటి క్యాన్సర్‌ కావొచ్చు
Mouth Cancer
Follow us

|

Updated on: Jun 07, 2024 | 5:18 PM

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో క్యాన్సర్‌ ఒకటి. రోజురోజుకీ క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్‌ ప్రభావం పెరుగుతోంది. మరీ ముఖ్యంగా నోటి క్యాన్సర్‌ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. పెదవులు, నాలుక, చిగుల్లు, టాన్సిల్స్‌, లాలాజల గ్రంథుల్లో కూడా క్యాన్సర్‌ ప్రారంభమవుతుంది.

అయితే శరీరంలో ఏ క్యాన్సర్‌ కారకాలు ప్రారంభమైనా కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా నోటి క్యాన్సర్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే చికిత్స కూడా అంతే సులభంగా ఉంటుంది. క్యాన్సర్‌ను త్వరగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మరి నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి క్యాన్సర్‌లో ఉన్న ప్రాథమిక లక్షణాల్లో దంతాలు వదులుగా ఉండడం ఒకటని నిపుణులు చెబుతున్నారు. అలాగే గొంతు చుట్టూ గడ్డలాగా ఏదైనా కనిపించినా వెంటనే అలర్ట్‌ అవ్వాలి. ఇక పెదవులపై వాపు లేదా పుండ్లు అయ్యి మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారం మింగుతున్న సమయంలో ఇబ్బంది లేదా నొప్పి కలిగినా, గొంతులో దీర్ఘకాలికంగా నొప్పి, నోటిలో రక్తస్రావం లేదా తిమ్మిరి వంటి లక్షణాలతో పాటు చిగుళ్లపై తెలుపు లేదా ఎరుపు రంగు మచ్చలు కనిపించినా ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్సలు చేయించుకోవాలని చెబుతున్నారు.

ఇక నోటి క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణాల్లో పొగాకు, మద్యపానం ముఖ్యమైనవని నిపుణులు చెబుతున్నారు. 80 శాతం కంటే ఎక్కువ నోటి క్యాన్సర్‌ కేసుల్లో రేడియోథెరపీ అవసరపడుతుంది. ఇక నోటి క్యాన్సర్‌ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు నోటి శుభ్రత పాటించకపోవడం, చిగుళ్ల వ్యాధి, పొగాకు నమలడం వంటి వాటి వల్ల కూడా నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నోటి క్యాన్సర్‌ను సీటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ స్కాన్‌ వంటి వాటి ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. నోటి క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే రేడియో థెరపీ ద్వారా నయం చేయవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్