‘మెట్‌గాలా’ స్టేజ్‌పై సంచలనం.. గ్లోబల్ వేదికపై సత్తా చాటిన తెలుగింటి ఆడబిడ్డలు

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ గాలా, కేన్స్ వంటి వేదికలపై మన తెలుగింటి ఆడబిడ్డలు మెరవడం ప్రతి తెలుగువారికీ గర్వకారణం. ఇటీవల మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై హైదరాబాద్‌కి చెందిన మోడల్ భవిత మండవ జీన్స్, టాప్‌ ధరించి నడిచిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆమె దుస్తుల గురించి విమర్శించినా, ఒక మధ్యతరగతి తెలుగు అమ్మాయి అంతర్జాతీయ బ్రాండ్ చానెల్‌కు అంబాసిడర్‌గా ఎదగడం వెనుక ఉన్న కృషిని మనం అభినందించాలి.

‘మెట్‌గాలా’ స్టేజ్‌పై సంచలనం.. గ్లోబల్ వేదికపై సత్తా చాటిన తెలుగింటి ఆడబిడ్డలు
The Rise Of Telugu Representation.jpg

Updated on: May 13, 2026 | 6:45 PM

దుబాయ్‌కి చెందిన ఇన్ ఫ్లూయెన్సర్ శ్రీలత అడెపల్లి తన వైరల్ వీడియో ద్వారా తెలుగు మహిళల విజయాలను అద్భుతంగా వివరించారు. భవిత మండవతో పాటు శోభిత ధూళిపాళ్ల, దీపిక ముత్యాల, రాజా కుమారి వంటి వారు తెలుగు మూలాల నుండి వచ్చి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లపై ఎలా రాణిస్తున్నారో ఆమె తెలియజేశారు. తెలుగు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వారు ఊహించని రంగాల్లో రాణించడం నిజంగా స్ఫూర్తిదాయకం అని ఆమె కొనియాడారు.

గ్లోబల్ వేదికలపై తెలుగింటి రత్నాలు

తెలుగు మూలాలున్న మహిళలు ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. 2024లో న్యూయార్క్ సబ్‌వేలో మోడల్‌గా గుర్తింపు పొందిన ఈ హైదరాబాద్ అమ్మాయి, చానెల్ క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ ఆధ్వర్యంలో మెట్ గాలా మెట్లు ఎక్కింది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమెను గుర్తించిన రోజు వేసుకున్న వాటికి ప్రతిరూపమే.

మాజీ మిస్ ఇండియా ఎర్త్ విజేత అయిన శోభిత, ‘మేడ్ ఇన్ హెవెన్’ వంటి సిరీస్‌లతో అంతర్జాతీయ రెడ్ కార్పెట్‌లపై మెరిసింది. ‘లైవ్ టింటెడ్’ ద్వారా బ్యూటీ రంగంలో ఉన్న అడ్డంకులను తొలగించి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. తన స్వరం, మూలాలు మరియు తెలుగు గుర్తింపును గ్లోబల్ స్టేజ్‌పై గర్వంగా చాటుతోంది.

సెలబ్రిటీల స్పందన

శ్రీలత అడెపల్లి చేసిన ఈ వీడియోకు సెలబ్రిటీల నుండి అద్భుతమైన స్పందన లభించింది. శోభిత ధూళిపాళ్ల స్పందిస్తూ.. “మన అంతరాత్మ చెప్పినట్లు వినడం, మనల్ని మనం గౌరవించుకోవడం ముఖ్యం” అని సలహా ఇచ్చారు. దీపిక ముత్యాల ఈ వీడియో చూసి భావోద్వేగానికి గురయ్యారు. రాజా కుమారి సైతం “తనను గుర్తించినందుకు ధన్యవాదాలు” తెలుపుతూ, కలలను అనుసరించడానికి వయస్సుతో సంబంధం లేదని పేర్కొన్నారు. మంచు లక్ష్మి, మానస శర్మ వంటి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పోస్ట్‌ను అభినందించారు.

Follow Us