Health Tips: పెద్దల మాట బంగారు బాట.. చిన్న చిట్కాతో ఇన్ని లాభాలా.. అటు మెదడుకు పదును.. ఇటు బరువుకు చెక్..

బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సూపర్ ఫుడ్ మన మెదడుకు పదును పెట్టడమే కాకుండా మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నానబెట్టిన బాదం తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Health Tips: పెద్దల మాట బంగారు బాట.. చిన్న చిట్కాతో ఇన్ని లాభాలా.. అటు మెదడుకు పదును.. ఇటు బరువుకు చెక్..
The Amazing Benefits Of Soaked Almonds

Updated on: Sep 19, 2025 | 10:25 PM

చిన్నప్పుడు మన అమ్మమ్మలు, అమ్మలు రోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదంపప్పులు తినమని బలవంతం చేసేవారు. ఇవి తింటే చదువు బాగా వస్తుంది, అన్నీ గుర్తుంటాయి అని చెప్పేవారు. ఇవి కేవలం మాటలే కాదు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి. అవును.. బాదంపప్పులు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని నానబెట్టి తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.

నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:

మెదడు పనితీరు

బాదంలో విటమిన్ E, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ మన మెదడుకు చాలా అవసరం. రోజూ 4-5 నానబెట్టిన బాదంపప్పులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియ

బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నానబెట్టిన బాదంలో ఉండే ఎంజైమ్‌లు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయి. దీనివల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.

బరువు తగ్గడం

బరువు తగ్గాలనుకునేవారికి నానబెట్టిన బాదంపప్పులు ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది, దాంతో అతిగా తినడం తగ్గుతుంది. అంతేకాకుండా ఇది మన జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి

నానబెట్టిన బాదంపప్పులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదంలో ఉండే ఖనిజాలు, విటమిన్లు మన శరీరాన్ని వైరల్ వ్యాధుల నుంచి కాపాడతాయి.

శక్తి

మీరు రోజంతా అలసిపోయినట్లు, నీరసంగా ఉన్నట్లయితే ఉదయం పూట నానబెట్టిన బాదం తినడం మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.

చర్మం, జుట్టు ఆరోగ్యం

బాదంపప్పులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E చర్మంపై ముడతలు, సన్నని గీతలను తగ్గిస్తాయి. దీనివల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. అలాగే ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం జుట్టును పొడవుగా, బలంగా, మరియు నల్లగా పెంచడంలో సహాయపడతాయి. నానబెట్టిన బాదంపప్పులు తినడం వల్ల జుట్టు మెరిసేలా ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..