Salt: ఉప్పుతో చర్మానికి కూడా ముప్పే… హెచ్చరిస్తోన్న నిపుణులు..

అందుకే ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. ఉప్పుతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రతిరోజూ 2.3 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. అయితే, WHO రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని సూచించింది...

Salt: ఉప్పుతో చర్మానికి కూడా ముప్పే... హెచ్చరిస్తోన్న నిపుణులు..
Salt
Follow us

|

Updated on: Jul 19, 2024 | 2:24 PM

ఉప్పు ప్రతీ ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో ఒకటి. కూరలో ఎన్ని రకాల మసాలాలు వేసినా ఉప్పు వేయకపోతే రుచి రాదు. అందుకే ‘అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు’ అనే సామెత కూడా ఉంది. అయితే రుచిని పెంచే ఉప్పు ఆరోగ్యంపై మాత్రం ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిసిందే. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉంటారు. హైబీపీ మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు అన్నింటికీ ఉప్పు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

అందుకే ఉప్పు విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూనే ఉంటారు. ఉప్పుతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని ఇప్పటికే పలు అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. యునైటెడ్ కింగ్‌డమ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రతిరోజూ 2.3 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. అయితే, WHO రెండు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలని సూచించింది. ఇక ఉప్పు ఎక్కువైతే బీపీ, హృదయ సంబంధిత సమస్యలు మాత్రమే వస్తాయని ఇప్పటి వరకు మనకు తెలుసు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తప్పవని నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎగ్జిమా రిస్క్ పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా చర్మంలో వాపు, పొడిబారడం, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యువతలో ఈ సమస్య ఎక్కవగా వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఒక రోజు ఒక గ్రాము ఉప్పు ఎక్కువగా తీసుకునే వారిలో తామర ప్రమాదం 22 శాతం ఎక్కువవుతుందని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే.. చర్మం రోగనిరోధక ప్రతిస్పందనను మార్చగలవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉప్పు సైటోకిన్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. తామరతో ఇబ్బంది పడేవారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది.

ఇక ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కనిపించే ప్రధాన లక్షణం డీహైడ్రేషన్‌. దీనంతో చర్మం పొడిబారుతుంది. అలాగే పొలుసులుగా మారుతుంది. చర్మంపై ముడతుల ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకునే వారి శరీరంలో నేరు పేరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ వాపు రావడానికి కారణమవుతుంది. ఇది ముఖం అందాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే ఉప్పును తక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కూరల్లో అదనంగా ఉప్పు వేసుకోవడం మానేయాలి. ఇక పచ్చళ్లకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఇక సాధారణ ఉప్పుకు బదులుగా బ్లాక్ సాల్ట్‌, రాక్ సాల్ ఉపయోగించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..