18 July  2024

దంతాల ఆరోగ్యం..  ఇలా పదిలం. 

Narender.Vaitla

తీసుకునే ఆహారంలో డైరీ ఉత్పత్తులను భాగం చేసుకోవడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పాలు, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులలో కాల్షియం, ఫాస్పరస్ దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేస్తుంది. 

యాపిల్స్‌, జామ, క్యారెట్ వంటి వాటిని తీసుకోవడం వల్ల దంత క్షయానికి చెక్‌ పెట్టొచ్చు. ఇవి  చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

గ్రీన్‌ టీ తాగడం వల్ల దంతాల సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్‌ గుణాలు చిగుళ్ల వ్యాధిని నివారించడానికి తోడ్పడతాయి.

బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌ కూడా దంతాల ఎనామిల్‌ను బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం దంతాల ఆరోగ్యాన్ని కాపడుతాయి.

పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా వీటిలోని విటమిన్లు, కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ చిగుళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

సాల్మన్‌, ట్యూనా, ట్రౌట్ వంటి చేపలు కూడా చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో లభించే ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ దంత క్షయాన్ని దరిచేరనివ్వదు.

విటమిన్‌ సి కూడా చిగుళ్లు, దంతాలను దృఢంగా మార్చడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా బత్తాయి, నారింజ, నిమ్మ లాంటివి నిత్యం తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.