Food Storage 8

ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి

19 July 2024

image

TV9 Telugu

వర్షాకాలంలో ఆరోగ్యం మాత్రమే కాడు ఆహారం కూడా త్వరగా పాడవుతుంది. దీంతో ఆహారం వృధా అవుతుంది. ఈ కాలంలో పప్పులు, బియ్యానికి కీటకాలు వేగంగా పడతాయి

TV9 Telugu

వర్షాకాలంలో ఆరోగ్యం మాత్రమే కాడు ఆహారం కూడా త్వరగా పాడవుతుంది. దీంతో ఆహారం వృధా అవుతుంది. ఈ కాలంలో పప్పులు, బియ్యానికి కీటకాలు వేగంగా పడతాయి

వర్షాకాలంలో, గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా పొడి ఆహారం, పప్పులు, సుగంధ ద్రవ్యాలు కీటకాల బారిన పడి పాడైపోతాయి

TV9 Telugu

వర్షాకాలంలో, గాలిలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా పొడి ఆహారం, పప్పులు, సుగంధ ద్రవ్యాలు కీటకాల బారిన పడి పాడైపోతాయి

అందుకే వర్షాకాలంలో ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా, వైరస్‌ ముప్పు వేగంగా పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, వండిన ఆహారం త్వరగా కుళ్లిపోతాయి

TV9 Telugu

అందుకే వర్షాకాలంలో ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా, వైరస్‌ ముప్పు వేగంగా పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, వండిన ఆహారం త్వరగా కుళ్లిపోతాయి

TV9 Telugu

వర్షాకాలంలో ఆహారాన్ని తాజాగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు అవసరం. ఈ చిట్కాల ద్వారా ఈ కాలంలో ఆహారాన్ని పాడవకుండా సులభంగా భద్రపరచుకోవచ్చు

TV9 Telugu

వర్షాకాలంలో ఆహారాన్ని భద్రపరచడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ కంటైనర్‌లో ఆహారం ఉంచాలి, వంటగదిలో ఆహారాన్ని ఎక్కడ ఉంచాలి అనే విషయాల పట్ల తగిన జాగ్రత్త వహించాలి 

TV9 Telugu

ఏదైనా ఆహార పదార్థాలను గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయాలి. అది పొడి ఆహారం లేదా వండిన ఆహారం ఏదైనా సరే.. గాలి చొరబడకుండా మూత బాగాపెట్టి మూసివేసి ఉంచాలి

TV9 Telugu

వండిన ఆహారం లేదా పప్పులు, గింజలు, మసాలాలు - ఇవి మీరు ఫ్రిజ్‌లో నిల్వ చేయగల ఆహార రకాలు. ఇది ఆహారాన్ని తాజాగా ఉంచుతుంది

TV9 Telugu

అయితే వండిన ఆహారాన్ని వేడి ఉన్నప్పుడే వెంటనే ఫ్రిజ్‌లో ఉంచవద్దు. వంట చేసిన తర్వాత, ఆహారాన్ని గది ఉష్ణోగ్రత వద్దకు ఉంచి, ఆపై ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా పాడవదు