బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి..
TV9 Telugu
19 July 2024
బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా ఆకుకూరలను తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
స్విస్ చార్డ్, కాలే, బచ్చలికూర, పాలకూర వంటి ఆకుకూరల్లే క్లరీలు, అధిక పోషకాలు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల త్వరగా ఆకలి వెయ్యదు. అతి తిండిని కంట్రోల్ చేస్తూ.. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణ ధాన్యాలను కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. ఫైబర్ అందుతుంది. ఇది బరువుని తగ్గించడంలో తోడ్పడుతాయి.
బెర్రీస్ అధిక కేలరీలను తీసుకోకుండా నియంత్రిస్తూ.. రుచిని కూడా అందిస్తాయి. వీటితో అధిక బరువు సమస్య దూరమవుతుంది.
ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బ్రేక్ ఫాస్ట్ కు తీసుకుంటే ఆకలిని నియంత్రించడంలో పాటు ఆరోగ్యకరమైన జీర్ణ క్రియకు సహాయపడుతాయి.
బాదం, వాల్ నట్, చియా సీడ్స్, అవిసెగింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ప్రొటీన్లు, ఫైబర్ లు సమృద్ధిగా ఉంటాయి.
గ్రీక్ యోగర్ట్ ను కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే.. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. ఇది శరీర బరువును తగ్గిస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి