
మన శరీరంలో పోషక శక్తిని తగ్గించే ఆహార పదార్థాల పొద్దుతిరుగుడు విత్తనాలు ఎప్పుడే టాప్‌లోనే ఉంటాయి. సుమారు 100 గ్రాముల పొద్దుతిరుగుడు పప్పులో దాదాపు 575 కేలరీల శక్తి లభిస్తుంది, ఇది చికెన్, మటన్ వంటి మాంసాహారాల కంటే ఐదు రెట్లు ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇందులో దాదాపు 20శాతం ప్రోటీన్, మంచి కొవ్వులు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
యవ్వన చర్మ సౌందర్యానికి రక్షకవచం
అంతే కాదు ఈ విత్తనాట్టో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. చర్మ సౌందర్యానికి, యవ్వనంగా ఎక్కువ కాలం కనిపించడానికి విటమిన్ ఈ అవసరం. చర్మం ముడతలు పడకుండా, స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. అనేక వ్యాధుల బారి నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా విటమిన్ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. పొద్దుతిరుగుడు పప్పులో 35 మిల్లీగ్రాములు ఉంటుంది. సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కంటే, సహజ రూపంలో పొద్దుతిరుగుడు పప్పు ద్వారా విటమిన్ ఈ ని తీసుకోవడం మరింత ప్రయోజనకరం.
ఖనిజ లోపాలను నివారణ
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాలలో మెగ్నీషియం ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు మెగ్నీషియం లోపాన్ని నివారించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి?
పొద్దుతిరుగుడు విత్తనాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు లేదా సాయంత్రం పండ్లతో పాటు తినవచ్చు. నానబెట్టడం వల్ల జీర్ణం సులభమై, పోషకాలు పూర్తిగా రక్తంలోకి చేరతాయి. ప్రయాణాలలో నానబెట్టడం కుదరకపోతే, ఇసుకలో వేయించిన పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా తీసుకోవచ్చు. రోజుకు 25-40 గ్రాముల మోతాదులో వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
ప్రకృతి వరం
ప్రకృతిలో లభించే ఆహారాలలో విత్తనాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వాటిలో పొద్దుతిరుగుడు పప్పు మూడు కీలక పోషకాలకు అగ్రస్థానంలో నిలుస్తూ, మన ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి గొప్ప తోడ్పాటును అందిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.