సండే స్పెషల్.. నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై.. ఈ ఒక్కటీ వేస్తే రుచి అదిరిపోద్దీ

Updated on: Jul 12, 2026 | 8:36 AM

సండే వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరూ చికెన్ వండుకొని తింటారు. అయితే ఈ సండే ఎప్పుడూ వండుకునే విధంగా కాకుండా చాలా రుచికరంగా ఉండే నెల్లూరు చికెన్ ఫ్రై ఎలా ప్రపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ ఈ టేస్టీ మసాలా వేస్తే చాలు రుచి అదిరిపోతుందంట. కాగా, ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
నెల్లూరు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : చికెన్ కేజీ, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, నూనె వన్ వాడకానికి తగినంత, నిమ్మరసం, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి,  అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, యాలకుల మసాలా, కొత్తిమీర, పూదీనా ఆకులు, నూనె, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే..  ముందుగా స్పెషల్ మసాలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. దాని కోసం యాలకులు, షాజీరా,అనాస పువ్వు, ఎండు మిర్చి, ధనియాలు ఇవన్నీ కూడా తీసి మంచిగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని, పౌడర్‌లా తయారు చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఘరం మసాలా రెడీ.

3 / 5
ఇప్పుడు చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో చికెన్ ప్రిపేర్ చేసుకోవాలి.

4 / 5
 పాన్‌లో పచ్చి మిర్చి, వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, షాజీరా అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో సారి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి.

5 / 5
ఇప్పుడు అందులో చికెన్ వేసి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పచ్చి వాసన పోయి మంచిగా వేగనివ్వాలి. అది బాగా ఉడికే వరకు దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. చికెన్ 70 శాతం ఉడికిన తర్వాత అందులో గరం మసాలా, యాలకుల మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ ఒకే సారి వేసి కొన్ని నీళ్లు పోసి మంచిగా ఉడికించుకోవాలి. కూర పూర్తిగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర, పూదీనా వేయాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన నెల్లూరు స్టైల్ చికెన్ ఫ్రై రెడీ.

Follow Us