మాంసాన్ని ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? పాడవకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలో తెలియాలి!

పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో మన ఇళ్లలోకి అవసరానికి మించి ఎక్కువ మాంసం (Meat) వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మిగిలిన మాంసాన్ని ఎన్ని రోజులు భద్రపరచాలి, ఎప్పటి వరకు వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిది అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మాంసాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెంది, అది విషపూరితంగా (Food Poisoning) మారుతుంది.

మాంసాన్ని ఎన్ని రోజులు నిల్వ చేయవచ్చు? పాడవకుండా ఉండాలంటే ఎలా స్టోర్ చేయాలో తెలియాలి!
Meat Storage Guide

Updated on: Jun 24, 2026 | 3:30 PM

ప్రత్యేక సందర్భాలలో మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మాంసం మిగిలిపోతుంటుంది. అలాంటి సమయాల్లో ఇంట్లో దానిని ఎలా నిల్వ చేయాలి..? ఎన్ని రోజులు నిల్వ ఉంచవచ్చు..? ఎప్పుడు తినడం సురక్షితం అనే సందేహం చాలామందికి వస్తుంది. మాంసాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం, పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో కేవలం 3 నుండి 5 రోజులు, అదే కీమాను 1 నుండి 2 రోజులు మాత్రమే ఉంచాలి. చికెన్ కూడా ఫ్రిజ్‌లో 1-2 రోజులే సురక్షితం. అయితే, -18°C ఉష్ణోగ్రత ఉన్న ఫ్రీజర్‌లో ఉంచితే మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మాంసం నిల్వకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఫ్రిజ్‌లో పచ్చి మాంసం ఎన్ని రోజులు ఉంటుంది?:

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA), యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) మార్గదర్శకాల ప్రకారం, పచ్చి మాంసాన్ని సాధారణ ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఉంచకూడదు. సాధారణ పచ్చి మాంసం ఫ్రిజ్‌లో 3 నుండి 5 రోజుల వరకు మాత్రమే సురక్షితంగా ఉంటుంది. అదే కీమా లేదా గ్రౌండ్ మీట్ అయితే కేవలం 1 నుండి 2 రోజుల్లోనే వాడేయాలి. చికెన్ వంటి పౌల్ట్రీ ఉత్పత్తులు ఫ్రిజ్‌లో 1 లేదా 2 రోజులు మాత్రమే బాగుంటాయి. ఒకవేళ చికెన్ వండేసినట్లయితే, దానిని 3 నుండి 4 రోజుల్లోగా తినేయడం మంచిది.

ఫ్రీజర్‌లో ఎక్కువ కాలం భద్రం:

మాంసాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడానికి అత్యుత్తమ మార్గం ఫ్రీజర్. -18°C లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్‌లో ఉంచినప్పుడు బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నిష్క్రియంగా మారిపోతాయి. ఎఫ్‌డీఏ ప్రకారం, రోస్ట్ మీట్‌ను 4 నుండి 12 నెలలు, చికెన్‌ను దాదాపు ఏడాది పాటు ఫ్రీజ్ చేయవచ్చు. చేపలు వాటి రకాలను బట్టి 2 నుండి 8 నెలల వరకు ఫ్రీజర్‌లో పాడవకుండా ఉంటాయి. అయితే, ఎక్కువ కాలం ఉంచడం వల్ల కాలక్రమేణా వాటి రుచి, నాణ్యత తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ప్యాకేజింగ్: మాంసాన్ని ఫ్రీజ్ చేసే ముందు ప్లాస్టిక్ ర్యాప్ లేదా ఫాయిల్ పేపర్‌తో అదనపు లేయర్ లాగా చుట్టాలి. దీనివల్ల మాంసంలోని తేమ బయటకు పోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

డీఫ్రాస్టింగ్ (Defrosting): ఫ్రీజర్‌లో గడ్డకట్టిన మాంసాన్ని సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి కరిగించడం అస్సలు సురక్షితం కాదు. దీనికి బదులుగా, ఆ మాంసాన్ని ఫ్రిజ్ కింద భాగంలో ఉంచడం ద్వారా లేదా చల్లని నీటిలో ప్యాకెట్‌ను ఉంచడం ద్వారా, లేదా మైక్రోవేవ్ సహాయంతో కరిగించాలి. తప్పుడు పద్ధతుల్లో కరిగిస్తే బ్యాక్టీరియా వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us