ఎండకు చర్మం కమిలిపోతుందా..? అయితే అలోవేరాతో చెక్‌ పెట్టండి.. ఎలాగో తెలుసా..?

Solve Skin Problems Aloe Vera : ఎండాకాలంలో చాలా మందికి చర్మ సమస్యలు వస్తాయి. ఎండ వేడికి చర్మం మొత్తం కమిలిపోతుంటుంది. మరో వైపు అధిక చమటతో రాషెస్‌ లాంటివి వస్తుంటాయి.

  • uppula Raju
  • Publish Date - 5:09 am, Wed, 7 April 21
ఎండకు చర్మం కమిలిపోతుందా..? అయితే అలోవేరాతో చెక్‌ పెట్టండి.. ఎలాగో తెలుసా..?
Aloe Vera Medicine For Burn

Solve Skin Problems Aloe Vera : ఎండాకాలంలో చాలా మందికి చర్మ సమస్యలు వస్తాయి. ఎండ వేడికి చర్మం మొత్తం కమిలిపోతుంటుంది. మరో వైపు అధిక చమటతో రాషెస్‌ లాంటివి వస్తుంటాయి. వీటికి ఎన్ని మందులు వాడినా అవి తగ్గవు. ఇలాంటి వాటికి చక్కటి పరిష్కారం అలోవేరా. నిత్యం మన ఇంటి ముందర ఉండే అలోవేరాతో చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.. ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడవచ్చు. మెరిసే అందమైన ఛాయను పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం పొడిబారిపోయి డ్రై ఉన్నట్టయితే ఈ చిట్కాలు పాటించండి. దీని వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండడానికి సహాయపడుతుంది. ఎక్కువగా చెమట పట్టడం వలన ఒంట్లోని నీరు తగ్గిపోతుంది. పొడిబారిపోయిన చర్మం ఉంటే కనుక అలోవెరాని మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం మంచిది. దీనివల్ల చర్మం డ్రై అయి పోకుండా హైడ్రేట్ గా ఉంటుంది. లేదు అంటే మీరు అలోవెరా క్రీమ్ ని కూడా ఉపయోగించొచ్చు. అలోవెరాని తీసుకుని అప్లై చేయడం వల్ల కూడా మీ స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది. సమ్మర్ లో కూడా  ఇది మీ స్కిన్ ని బాగా కాపాడుతుంది.

అలోవెరా వల్ల కేవలం డ్రై స్కిన్ ని తగ్గించుకోవడం మాత్రమే కాదు. మంచి రిలీఫ్ కూడా దొరుకుతుంది. ఎప్పుడైనా ఏమైనా స్కిన్ సమస్యలు, దురదలు మంటలు వంటివి కలిగినపుడు మంచి ఉపశమనం మీకు అలోవెరా ఇస్తుంది. అలోవెరాకు చల్లదనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది ఇది మిమ్మల్ని చల్లబరుస్తుంది. మీకు ఇబ్బంది కలిగిన ప్రదేశం లో అలోవెరా జెల్ ను ఉపయోగించారంటే తప్పకుండా  రిలీఫ్ ఉంటుంది. మరీ ఎక్కువగా ఉంటే. రాత్రి పూట అలోవెరా జెల్ ని రాసి ఉదయాన్నే చల్లని నీళ్ళ తో కడిగేయండి. ఇలా చేస్తే తొందరగా నయం అవుతుంది.

నాచురల్ పదార్థం అయిన అలోవేరా ఏ చర్మం వాళ్లకి అయినా కూడా మంచి బెనిఫిట్స్ ని ఇస్తుంది. వేసవి లో ఎక్కువగా బర్నింగ్ వంటివి ఉంటాయి. అలాగే చర్మం పొడిబారిపోవడం లేదా చర్మం పై దురదలు రావడం వంటివి సాధారణమే. చాలా మంది ఈ సమస్య తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అలోవెరోని కనుక ఉపయోగించారంటే.. తప్పకుండా మంచి ఉపశమనం లభిస్తుంది.

చర్మం పొడిబారి పోయినా, మంట వున్నా అలోవెరా గుజ్జు పూస్తే బాగా పనిచేస్తుంది. ఎస్ పి ఎఫ్ తో కలిపి అలోవెరాని రాసినట్లయితే యుఆర్ కిరణాల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలోవెరా కేవలం పొడిబారిపోయే చర్మం, దద్దుర్లు మంటలకి మాత్రమే కాదు. మంచి అందమైన చర్మాన్ని కూడా సొంతం చేస్తుంది. అలానే జుట్టుకు కూడా అలోవెరా చాలా మంచిది. తక్కువ సమయం ఉన్నప్పుడు కూడా అలోవెరాని ఉపయోగిస్తే సులువుగా మార్పు కనిపిస్తుంది.  స్కిన్ ఇరిటేషన్ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు మీకు మంచి రిలీఫ్ దొరుకుతుంది.

పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఎంపీ కనిమొళి.. మీడియాకు విజయ సంకేతం చూపించి తిరిగి అంబులెన్స్‌లోకి..

వైసీపీ సర్కారుకి హైకోర్టు తీర్పు చెంపపెట్టన్న బాబు, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రబ్బరు స్టాంపులా మారకూడదని హితవు

Narang set to Marry: ఓ ఇంటివాడు కాబోతున్న స్టార్​ షూటర్​ గగన్ నారంగ్​.. 21న హైదరాబాద్‌లోని ఒక స్టార్‌ హోటల్లో వివాహం