Kitchen Hacks: వార్నీ.. బయటకు వెళ్లే ముందు సింక్ లో ఓ కాగితం ముక్క వేస్తే ఇన్ని ప్రయోజనాలా?

మనం ఇంటి పనులంటే వంట చేయడం, క్లీనింగ్ చేయడం వంటి పెద్ద పనుల గురించే ఆలోచిస్తాం. కానీ కొన్నిసార్లు అతి చిన్న మార్పులు మన జీవితాన్ని చాలా సులభతరం చేస్తాయి. అందులో ఒకటి.. ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కిచెన్ సింక్‌లో ఒక కాగితం ముక్కను, ఒక ఖాళీ గ్లాసును ఉంచడం. వినడానికి ఇది వింతగా అనిపించినా, దీని వెనుక ఉన్న లాజిక్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, మీ ఇంటి గోడలు పాడవకుండా కాపాడుతుంది.

Kitchen Hacks: వార్నీ.. బయటకు వెళ్లే ముందు సింక్ లో ఓ కాగితం ముక్క వేస్తే ఇన్ని ప్రయోజనాలా?
Kitchen Sink Maintenance

Updated on: Feb 28, 2026 | 5:46 PM

ఆఫీసుకో లేదా ఊరికో వెళ్ళినప్పుడు ట్యాప్ సరిగ్గా కట్టేశానా? పైపు నుంచి నీరు కారుతుందా? అనే టెన్షన్ మనల్ని వెంటాడుతుంటుంది. అలాగే ఇంటికి రాగానే సింక్‌లో పేరుకుపోయిన గిన్నెల కొండను చూస్తే నీరసం వచ్చేస్తుంది. ఈ రెండు సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం.. సింక్‌లో ఒక చిన్న కాగితం ముక్క! ఈ సింపుల్ హ్యాక్ ఎలా పనిచేస్తుంది? దీనివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. లీకేజీలను పట్టేసే ‘పేపర్ టెస్ట్’

బయటకు వెళ్లే ముందు సింక్‌ను ఖాళీ చేసి, అడుగున ఒక పాత కాగితం లేదా అనవసరమైన కవరును పరచండి.

సాయంత్రం మీరు తిరిగి వచ్చినప్పుడు ఆ కాగితం పొడిగా ఉంటే పైపులు బాగున్నాయని అర్థం. ఒకవేళ కాగితం తడిసి ఉంటే, పైపుల నుంచి నీరు లీక్ అవుతుందని మీరు వెంటనే గుర్తించవచ్చు. దీనివల్ల గోడలు తేమ పట్టకుండా ముందే జాగ్రత్త పడొచ్చు.

2. గిన్నెల కొండకు చెక్ పెట్టే ‘టంబ్లర్ ట్రిక్’

పేపర్ పైన లేదా పక్కన ఒక ఖాళీ గాజు గ్లాసును (టంబ్లర్) బోర్లించి ఉంచండి.

సింక్‌లో ఒక కాగితం, గ్లాసు నీట్ గా అమర్చి ఉండటం చూస్తే, ఇంట్లోని మిగతా సభ్యులు అందులో అపరిశుభ్రమైన గిన్నెలు వేయడానికి సంకోచిస్తారు. ఫలితంగా గిన్నెలు సింక్ బయటే పేరుకుపోతాయి. మీరు అలసిపోయి ఇంటికి రాగానే సింక్ ఖాళీగా ఉంటే ఆ సంతోషమే వేరు కదా!

3. టెన్షన్ లేకుండా

ఇంటికి తాళం వేసిన తర్వాత చాలామందికి ట్యాప్ ఆపానా లేదా అనే అనుమానం వస్తుంది. ఈ పేపర్ అలవాటును క్రమం తప్పకుండా పాటిస్తే, ఆ కాన్ఫిడెన్స్ తో మీరు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us