Hair Care: రాత్రిళ్లు తడి జుట్టుతోనే నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు

సాధారణంగా పడుకునే ముందు తల స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. రోజంతా మీ శరీరం నుండి చెమట, ధూళిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

Hair Care: రాత్రిళ్లు తడి జుట్టుతోనే నిద్రపోతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు
Wet Hair
Follow us

|

Updated on: Dec 02, 2022 | 8:45 PM

అమ్మాయిల అందాన్ని పెంచడంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి . కాబట్టి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. జుట్టుకు మంచి పోషణ అందించడం చాలా ముఖ్యం. ఇక మనం తీసుకునే ఆహారం కూడా జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుంటే శిరోజాలు బలంగా మారుతాయి. ఇక సాధారణంగా పడుకునే ముందు తల స్నానం చేయడం చాలా మంచిది. ఎందుకంటే అది మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. రోజంతా మీ శరీరం నుండి చెమట, ధూళిని తొలగించడంలో కూడా సహాయపడుతుంది. ఇది మీకు రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అయితే చాలామంది రాత్రి పూట తలస్నానం చేసి అలాగే నిద్రపోతుంటారు. తడి జుట్టును ఆరబెట్టుకోకుండా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. మీకు కూడా అలాంటి అలవాటు ఉందా? అయితే వెంటనే మార్చుకోండి. లేకపోతే జుట్టు  ఆరోగ్యం  బాగా దెబ్బతింటుంది.

కురులు బలహీనం..

అవును.. జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా పెళుసుగా ఉంటుంది. అందుకే జుట్టు తడిగా ఉన్నప్పుడు అసలు దువ్వకూడదు. ఇక రాత్రి సమయంలో తడి జుట్టుతో పడుకుంటే మరింత బలహీనంగా మారుతుంది. కాబట్టి రాత్రిపూట తలస్నానం చేసి తడి జుట్టుతో నిద్రించే అలవాటును వదిలేయండి. అయితే పడుకునే సమయంలో మీ జుట్టు తడిగా ఉంటే బన్ లేదా పోనీ టైల్ లో వేసుకుని పడుకోండి. ఇది వెంట్రుకలు రాలిపోకుండా నిరోధిస్తుంది.

బ్యాక్టీరియాతో..

అంతేకాదు తడి జుట్టుతో నిద్రపోవడం చాలా అపరిశుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే దిండు మీ తడి జుట్టు నుండి నీటిని గ్రహిస్తుంది. ఇది మీ దిండులో బ్యాక్టీరియా పెంపకానికి దారితీస్తుంది. చెమట, చనిపోయిన చర్మ కణాలు, నూనెలు మీ దిండుపై ఉంటాయి. దీంతో దిండులో వాసనతోపాటు బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది. కాబట్టి మీ జుట్టును వీలైనంత ఆరబెట్టుకుని నిద్రకు ఉపక్రమించండి. లేదంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..