
పచ్చి మాంసం బ్యాక్టీరియా
పచ్చి మాంసంలో చెడు బ్యాక్టీరియా చాలా ఉంటుంది. ఎందుకంటే అది పచ్చిగా ఉంటుంది. మనం చికెన్ షాప్ నుంచి తెచ్చి కిచెన్ లో పెట్టేసి గంట, రెండు గంటల ఆగిన తర్వాత వండుకుని తింటాము అయితే, ఈ లోపే మీ వంటగదిలో చెడు బ్యాక్టీరియా పాత్రల మీదకి పాకే ఉంటుంది. మీరు దీనిని గమనించరు. అదంతా మర్చిపోయి వెంటనే ఒకసారి మాంసాన్ని కడిగి పొయ్యి మీద పడేసి వెళ్ళిపోతారు. అయితే, అలా కాకుండా మీరు ఇంట్లోకి తీసుకురాకముందే బయటే మూడు సార్లు కడిగి వంట గదిలో పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి నుంచి నేరుగా మాంసాన్ని ఇంట్లోకి తీసుకెళ్ళకండి. చేదు బ్యాక్టీరియా ఇల్లు మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి, పచ్చి మాంసం ఇంట్లో ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
వండిన మాంసంలో బాక్టీరియా
మాంసం కూర వండేటప్పుడు మంచిగా ఉడికించాలి లేదంటే దానిని తిన్నపుడు సమస్యలు వస్తాయి. అలాగే, అలా మంట మీద ఉడికించినప్పుడు పచ్చి మాంసంపై ఉన్న చెడు బ్యాక్టీరియా మొత్తం ఆవిరయ్యి నాశనం అవుతుంది. మీరు ఏ నాన్ వెజ్ కూర వండే ముందు అయినా దానిని ఒకటికి రెండు సార్లు కడిగి వండుకోవాలి. ఎందుకంటే దానిలో కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన కంటికి కనిపించనంత చిన్నగా ఉంటాయి. ఇంకా కొన్ని బ్యాక్టీరియా మంట మీద ఉన్నా కూడా నాశనం కావు. అవి ఆహారాల్లో అలాగే ఉండిపోతాయి. మసాలాలు, అల్లం , వెల్లుల్లి వేసినప్పుడు అవి అంతం అవుతాయి. ఇందుకోసమే వైద్యులు కూడా మాంసాహారులు వండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే తిన్న తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతారు.
అయితే, మనం ఎక్కువగా చికెన్, మటన్ తింటాము ఎందుకంటే దీనిలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి ఇవి మనకి మేలు చేస్తాయి కానీ మాంసం తెచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే తెచ్చాక వండేటప్పుడు జాగ్రత్తగా కుక్ చేయాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)