Health Tips: కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం.. ఈ ఆకు లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..

ఆధునిక జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్లు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. కూల్ డ్రింక్స్, డార్క్ చాక్లెట్స్, ఆక్సలేట్స్ అధికంగా ఉండే పదార్థాలు, తక్కువ నీరు తాగడం వంటివి కిడ్నీ స్టోన్స్‌కు ప్రధాన కారణాలు. ఇవి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్‌గా ఏర్పడి సమస్యలను సృష్టిస్తాయి. ఈ సమస్యలను నివారించడంలో రణపాల ఆకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Health Tips: కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం.. ఈ ఆకు లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు..
Medicinal Leaf Ranapala Aaku

Updated on: Jan 12, 2026 | 12:57 PM

నేటి ఆధునిక జీవనశైలిలో ముఖ్యంగా యువతలో కిడ్నీలో రాళ్ల సమస్య సర్వసాధారణంగా మారింది.. ఇవి పెరిగితే.. అనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. ఒక్కో సారి పరిస్థితి తీవ్రంగా కూడా మారవచ్చు.. కూల్ డ్రింక్స్, డార్క్ చాక్లెట్స్, ఆక్సలేట్స్ అధికంగా ఉండే పదార్థాల వినియోగం, సాఫ్ట్ డ్రింక్స్ అధికంగా త్రాగడం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ పేరుకుపోయి రాళ్లు ఏర్పడుతున్నాయి. సుమారు 70 శాతం కిడ్నీ రాళ్లు కాల్షియం, ఆక్సలేట్స్ కలయికతో ఏర్పడేవే. ఈ సమస్యను నివారించడంలో, ఉన్న రాళ్లు పెరగకుండా చేయడంలో “రణపాల ఆకు” అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కిడ్నీలో రాళ్ల నివారణకు రణపాల ఆకు..

2013లో శ్రీలంకలోని యూనివర్సిటీ ఆఫ్ జఫ్ని పరిశోధకులు రణపాల ఆకుపై నిర్వహించిన అధ్యయనాలు, ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా సమర్థవంతంగా రక్షిస్తుందని నిరూపించాయి. ఈ ఆకులో 12 రకాల కెమికల్ కాంపౌండ్స్, వివిధ రకాల ఫైటో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఇవి కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసేటప్పుడు ఏర్పడే కాల్షియం, ఆక్సలేట్స్ కలయికను నిరోధిస్తాయి. ఫలితంగా, రాళ్లు ఏర్పడటానికి అవసరమైన ప్రక్రియ జరగదు.

రణపాల ఆకులో ఉండే పాలీఫెనాల్స్ కిడ్నీ స్టోన్స్ వల్ల దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, ఇవి మూత్రం ద్వారా అధిక కాల్షియం బయటకు పోకుండా నియంత్రిస్తాయి.. తద్వారా స్టోన్ ఫార్మేషన్ అవకాశాలను తగ్గిస్తాయి. ఈ లక్షణాల కారణంగా, రణపాల ఆకు కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవడానికి, ఉన్నవారికి అవి పెరగకుండా నియంత్రించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

గాయాలు, పుళ్లు, గ్యాంగ్రిన్‌లకు రణపాల ఆకు ప్రయోజనాలు..

కిడ్నీ స్టోన్స్ నివారణతో పాటు, రణపాల ఆకు ఇతర వైద్య గుణాలను కూడా కలిగి ఉంది. దెబ్బలు, పుళ్లు, గాయాలు, గ్యాంగ్రిన్ వంటి సమస్యలకు ఇది శక్తివంతమైన పరిష్కారం. గ్యాంగ్రిన్ వల్ల ఏర్పడే పుళ్లు మానకుండా, స్పర్శ కోల్పోయిన భాగాలపై రణపాల ఆకు పేస్ట్‌కు పసుపు కలిపి రాస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆకులో ఉండే బ్రయోఫిల్లిన్, బెర్సాల్డిజెనిన్ 1, 3, 5 ఆర్తోఎసిటేట్ వంటి కెమికల్ కాంపౌండ్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు గాయాలను త్వరగా మాన్పడానికి దోహదపడతాయి.

చెవి ఇన్ఫెక్షన్లకు..

కొంతమందికి చెవిలో చీము కారడం, నొప్పి, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. రణపాల ఆకు పసరును వడగట్టి చెవిలో వేయడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చీమును తగ్గించి, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే నొప్పిని నివారిస్తాయని పేర్కొంటున్నారు..

రణపాల ఆకు వాడే విధానం..

రణపాల ఆకు గ్రామీణ ప్రాంతాలలో పిచ్చి మొక్కలాగా విస్తృతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కూడా ఈ మొక్కలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక మధ్యస్థాయి మొక్క సుమారు 200 రూపాయలకు లభిస్తుంది. దీనిని ఉపయోగించడానికి, 4-5 ఆకులను 100 మి.లీ నీటిలో వేసి డికాక్షన్ లాగా మరిగించి వడగట్టాలి. ఈ డికాషన్‌లో తేనె, చెరుకు పానకం లేదా ఖర్జూరం పేస్ట్‌ను తీపి కోసం కలుపుకుని సేవించవచ్చు. అయితే, పచ్చి ఆకు రసాన్ని నేరుగా వాడకూడదు. డికాక్షన్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.

రణపాల ఆకు వినియోగంతో పాటు, రోజుకు నాలుగు లీటర్ల మంచి నీటిని త్రాగడం, సహజసిద్ధమైన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వంటి నియమాలను పాటించడం ద్వారా కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారించవచ్చు. ఈ నియమాలు కిడ్నీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.

గమనిక..

అయితే, ఎటువంటి వైద్య సలహా లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. ఏమైనా సమస్య ఉంటే.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us