Pregnancy: గర్భిణీలు ఆహారం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫెర్నాండెజ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం అధిపతి డాక్టర్ లతా శశి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తల్లిగా మారాలనుకనే మహిళలు గ్యాస్ట్రోఎంటెరిటిస్, కామెర్లు, లూజ్ స్టూల్స్ వంటి ఆనారోగ్య పరిస్థితులను నివారించడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా తెలిపారు. ఇంతకీ డాక్టర్‌ చెప్పిన ఆ సూచనలు ఏంటంటే..

Pregnancy: గర్భిణీలు ఆహారం విషయంలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Pregnancy
Follow us

|

Updated on: Jun 07, 2024 | 4:29 PM

గర్భందాల్చడం ప్రతీ జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. తనలాంటి మరో రూపానికి జన్మనివ్వనున్నాననే సంతోషం ఓవైపు, ఏదో తెలియని ఆందోళన మరోవైపు ప్రతీ మహిళను వెంటాడుతుంటుంది. తీసుకునే ఆహారం మొదలు, జీవన విధానం వరకు అన్నింటిలో మార్పు వచ్చే సమయం ఇదే. దీంతో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి.? లాంటి విషయాల్లో ఎన్నో అనుమానాలు ఉంటాయి. వీటిని నివృత్తి చేయడానికే హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆసుపత్రి ఫెర్నాండెజ్‌కు చెందిన వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫెర్నాండెజ్ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం అధిపతి డాక్టర్ లతా శశి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తల్లిగా మారాలనుకనే మహిళలు గ్యాస్ట్రోఎంటెరిటిస్, కామెర్లు, లూజ్ స్టూల్స్ వంటి ఆనారోగ్య పరిస్థితులను నివారించడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలో సవివరంగా తెలిపారు. ఇంతకీ డాక్టర్‌ చెప్పిన ఆ సూచనలు ఏంటంటే..

* వీలైనంత వరకు ఇంట్లో భోజనాన్ని తీసుకోవడానికే ప్రయత్నించాలి. ఒకవేళ బయటి ఫుడ్ తినాలని అనిపిస్తే. పరిశుభ్రత, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిచ్చే రెస్టారెంట్లకు మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు.

* ఇక గర్భిణీలు వీలైనంత వరకు వేడి వేడి ఆహారాన్ని తీసుకోవడానికి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించాలి.

* సీ ఫుడ్‌ తీనే సమయంలో మంచిగా వండారా లేదా అనేది పరీక్షించండి., లేదంటే ప్రమాదకరమైన బాక్టీరియా చేరే అవకాశాలు ఉంటాయి. ఫుడ్‌ స్టోర్‌లు లేదా బఫేల నుండి ముందస్తుగా ప్యాక్ చేసిన సలాడ్‌లు, ఆహార పదార్థాలను నివారించండి.

* అన్నింటికంటే ముఖ్యంగా భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే 60 శాతం ఆల్కహాల్‌తో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించాలి.

* స్ట్రీట్ ఫుడ్‌ను పూర్తిగా అవయిడ్ చేయాలి. పానిపూరీ, కట్‌లెట్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్స్‌లో చేసే ఆహార పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

* ఇక రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని తినకపోవడం మంచిది. మరీ ముఖ్యంగా వాటిని సరిగ్గా నిల్వచేయకుండా మళ్లీ వేడి చేసి తినడం అత్యంత ప్రమాదకరం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్