
హిందూ సంప్రదాయంలోనూ, జ్యోతిష్య శాస్త్రంలోనూ పూజలకు, కొన్ని రకాల పరిహారాలకు నిమ్మకాయలు, లవంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లో తరచూ గొడవలు జరగడం, అనారోగ్య సమస్యలు, లేదా ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరుగుతుంటే.. అక్కడ ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) ఎక్కువగా ఉందని అర్థం. ఈ నెగటివిటీని దూరం చేసి, లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందేందుకు జ్యోతిష్య నిపుణులు ఒక అద్భుతమైన పరిహారాన్ని పంచుకున్నారు.
ఈ పరిహారం కోసం ఒక తాజా నిమ్మకాయను, 4 లవంగాలను తీసుకోవాలి. నిమ్మకాయకు ఎక్కడా మచ్చలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఆ నిమ్మకాయకు నాలుగు వైపులా ఈ 4 లవంగాలను గుచ్చాలి గుచ్చేటప్పుడు లవంగాలు విరిగిపోకుండా పూర్తిగా ఉండాలి. దీనిని చేతిలో పట్టుకుని, మీ ఇష్టదైవాన్ని లేదా హనుమంతుడిని స్మరిస్తూ, ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోవాలని కోరుకోవాలి. ఆపై ఈ లవంగాలు గుచ్చిన నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారం (మెయిన్ డోర్) లోపలి భాగంలో లేదా హాల్‌లోని ఒక మూలలో ఎవరికీ తగలకుండా ఉంచాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిమ్మకాయ, లవంగాల కలయిక చుట్టుపక్కల ఉండే ప్రతికూల తరంగాలను, చెడు దృష్టిని (దిష్టి) తన వైపునకు ఆకర్షించి నశింపజేస్తుంది. వ్యాపార స్థలాలలో లేదా ఆఫీసుల్లో ఈ పరిహారం చేయడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోయి లాభాలు వస్తాయి. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి, మనశ్శాంతి లభిస్తుంది.
ఈ నిమ్మకాయ ఎండిపోయిన తర్వాత లేదా రంగు మారిన తర్వాత సాధారణంగా వారానికి ఒకసారి, దానిని తీసివేసి ఎవరూ తొక్కని చోట లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఆ స్థానంలో మళ్లీ కొత్త నిమ్మకాయతో ఇదే విధంగా పరిహారం చేసుకోవాలి.
ఎలాంటి ఖర్చు లేకుండా, ఇంట్లోనే లభించే వస్తువులతో చేసుకోగల ఈ చిన్న ఆధ్యాత్మిక పరిహారం ఇంట్లో సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. నమ్మకంతో ఈ పరిహారాన్ని పాటించి మీ ఇంటిని వాస్తు దోషాల నుండి రక్షించుకోండి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..